పెళ్లైన ప్రతీసారి ప్రెగ్నెన్సీ… ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్ కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

రవితేజ- వినాయక్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘కృష్ణ’ లో బాబీ.. అంటూ బ్రహ్మానందం ను పిలిచి నవ్వులు పూయించిన కరాటే కళ్యాణి గురించి తెలియని వారంటూ ఉండరు. అటు తరువాత ‘మిరపకాయ్’ సినిమాలో కూడా ‘అబ్బా పిండేసారు’ అంటూ చెప్పే డైలాగ్ తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది కళ్యాణి. సినిమాల్లో బోల్డ్ పాత్రలు చేస్తూ.. లేట్ వయసులో కూడా అందాల ఆరబోత చేసిన కళ్యాణి.. నిజ జీవితంలో మాత్రం ఇలా ఉండదట. ఆంధ్రప్రదేశ్ కు చెందిన శ్రీకాకుళం జిల్లా కవిటిలో జన్మించిన కరాటే కళ్యాణి.. విజయనగరంలో పెరిగింది. అయితే నటన పై ఉన్న మక్కువతో నాటకాలు, బుర్రకథ, హరికథల్లో వేషాలు వేసి పాపులర్ అయ్యింది. ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చే ముందు కరాటే కళ్యాణి చేసిన కామెంట్స్ ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి.

ఆమె మాట్లాడుతూ.. “కరాటే కళ్యాణి అంటే అందరూ నా స్క్రీన్‌ నేమ్ అనుకుంటారు. కానీ అది నిజం కాదు. నేషనల్ లెవెల్లో 4సార్లు కరాటేలో గోల్డ్ మెడల్ సంపాధించాను. అందువల్లనే నా పేరు ముందు కరాటే అని చేరింది.నాకు మా నాన్న గారు అంటే ఎంత ప్రాణమో.. అలాగే హరికథ అంటే కూడా అంతే ప్రాణం. అందరి జీవితంలో పెళ్లి అనేది గొప్ప వరం. అయితే కొంతమందికి దురదృష్టం కూడా..!. అలాగే నాకు కూడా పెళ్లైన ప్రతిసారి ప్రెగ్నెన్సీ రావడం.. పోవడం జరిగేది. సీమంతం చేసుకోవాలనే కోరిక ఉండేది. బిడ్డతో నిండి ఉన్న నా పొట్టను నేను చూసుకుని మురిసిపోవాలి అనేది నా కోరిక.కానీ అది తీరలేదు. పెళ్లి అనేది నాకు కలిసిరాలేదు.. నన్ను అందరూ మోసం చేశారు.నన్ను శారీరకంగా వాడుకున్నారు తప్ప.. ఎవ్వరూ నా కోసం కేర్ తీసుకోలేదు.అలాంటి టైంలో నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది.

ఒక కోళ్లగూడులో ఒక బాబుని పడేశారు.. ఆ బాబుని చీమలు కుట్టేశాయి. బాబు పరిస్థితి దారుణంగా ఉంది.. మీరు పెంచుకుంటారా? అని నన్ను అడిగారు. ఆరోజు నుండీ ఈరోజు వరకూ వాడిని నా గుండెలపై పెట్టుకుని పెంచుతున్నాను. వాడికి ఇప్పుడు పదేళ్లు” అంటూ చెప్పుకొచ్చింది కరాటే కళ్యాణి. ఇక ‘బిగ్ బాస్4’ లో కళ్యాణి మొదటి నామినేషన్ నుండీ తప్పించుకుంది. మరి నెక్స్ట్ వీక్ ఈమె ఎలాంటి పరిస్థితుల్లో హౌస్ లో కొనసాగుతుందో చూడాలి..!

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్ ఇంట్లో అభిజీత్‌ లాంటోడు ఉండాల్సిందే!
బిగ్ బాస్ 4 నామినేషన్: కిటికీల ఆటలో తలుపులు మూసేసింది ఎవరికంటే?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus