బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కరీనాకపూర్ జంటగా అద్వైత చందన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లాల్ సింగ్ చద్దా. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా థియేటర్లో విడుదలయి మిశ్రమ స్పందన దక్కించుకుంది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయిందని చెప్పాలి.
ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోకపోవడానికి గల కారణం కేవలం నెగిటివ్ ప్రచారమే అని తెలుస్తోంది. ఈ సినిమాని బాయ్ కాట్ చేయాలని, ఎవరు ఈ సినిమాని చూడకూడదంటూ హష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తూ ఉన్నారు.ఇలా ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున నెగిటివ్ ప్రచారం చేయడంతో ఈ వార్తలపై కరీనాకపూర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సోషల్ మీడియా వేదిక కొందరు ఉద్దేశపూర్వకంగా మా సినిమాని ట్రోల్ చేస్తున్నారు.
ఈ సినిమాని ట్రోల్ చేసినప్పటికీ ఈ సినిమాకు వస్తున్న స్పందన మరోలా ఉంది అంటూ ఈమె వెల్లడించారు.
కొందరు ఉద్దేశపూర్వకంగానే ఈ సినిమాని టార్గెట్ చేస్తూ ఇలా చేస్తున్నారని అయితే ఈ సినిమా ప్రతి ఒక్కరు తెరపై చూడాల్సిన సినిమా అంటూ ఈమె తెలిపారు.ఈ సినిమా కోసం దాదాపు రెండున్నర సంవత్సరాల నుంచి కొన్ని వందల మంది ఆర్టిస్టులు కష్టపడ్డామని,దయచేసి ఈ సినిమాని బహిష్కరించండి అంటూ నెగిటివ్ ప్రచారం చేయొద్దు అంటూ ఈమె చేతులు జోడించి అందరిని వేడుకున్నారు.
ఇకపోతే ఈ సినిమా హాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ఫారెస్ట్ గంప్ సినిమాకి రీమేక్ చిత్రంగా తెరకెక్కించారు. ఈ సినిమాతో టాలీవుడ్ నటుడు నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ సినిమాని నటుడు అమీర్ ఖాన్ తన సొంత బ్యానర్ లో నిర్మించారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో పలు భాషలలో విడుదలైనప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేదని చెప్పాలి.