Darshan Arrest: రేణుకస్వామి హత్య కేసులో దర్శన్, పవిత్ర అరెస్ట్

కన్నడ స్టార్ హీరో దర్శన్‌కు పెద్ద షాక్ తగిలింది. తన అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న దర్శన్ అరెస్ట్ అవ్వడం.. ఈ మధ్యనే బయటకు రావడం అందరికీ తెలిసిన సంగతే. అయితే దర్శన్ కు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు వ్యతిరేకించింది. అలాగే కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సైతం రద్దు చేసింది. సుప్రీం కోర్టు తీర్పుతో కన్నడ జనాలకు, దర్శన్ అభిమానులకు పెద్ద షాక్ తగిలినట్టు అయ్యింది.

Darshan arrest

అలాగే దర్శన్ ను వెంటనే అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది కోర్టు. అతనితో పాటు పవిత్రని అలాగే మరో ముగ్గురు నిందితులను కూడా కూడా కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేసేందుకు రెడీ అయ్యారు.


దర్శన్ పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అవ్వడానికి పవిత్రే కారణమని.. అతని అభిమాని రేణుకాస్వామి మీడియా, సోషల్ మీడియా వేదికగా రచ్చ చేసినందున… దర్శన్ ని పవిత్ర రెచ్చగొట్టి.. మనుషులను పెట్టి కిరాతకంగా కొట్టించేలా చేసింది. దీంతో రేణుకాస్వామి తీవ్రంగా గాయపడ్డాడు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అవి ఎంత దారుణంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చూసి తట్టుకోలేనంత సెన్సిటివ్ గా ఉన్నాయి. ఇక పోలీసుల విచారణలో కూడా దర్శన్ ప్రధాన నిందితుడు అని తేలింది. దీంతో కర్ణాటక పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. కొన్నాళ్ళు జైలు ఊచలు లెక్కబెట్టిన దర్శన్ కి మధ్యంతర బెయిల్ రావడంతో బయటకు వచ్చాడు. తర్వాత అతనికి రెగ్యులర్ బెయిల్ మంజూరు అయ్యింది. అది క్యాన్సిల్ అవ్వడం వల్ల ఇప్పుడు మళ్ళీ అతను జైలుకెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి.

రూ.60 కోట్ల చీటింగ్.. శిల్పా శెట్టి దంపతుల పై కేసు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus