Karthi,Prabhas: కార్తీ ‘వీరుమాన్’ ను అందుకే తెలుగులో విడుదల చేయలేదా?

కార్తీ హీరోగా శంకర్ కూతురు అదితి హీరోయిన్ గా ‘వీరుమాన్’ అనే చిత్రం తెరకెక్కింది.ముత్తయ్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఆగస్టు 12 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ మూవీ అక్కడ భారీ వసూళ్లను రాబడుతోంది. కార్తీ అన్నయ్య, హీరో సూర్య ఈ చిత్రానికి నిర్మాత. ఈ మధ్య కాలంలో తమిళంలో పెద్ద సినిమాలు రాలేదు. ‘విక్రమ్’ తర్వాత అక్కడ చాలా గ్యాప్ వచ్చింది.

దీంతో ‘వీరుమాన్’ చిత్రం అత్యధిక థియేటర్లలో రిలీజ్ అయ్యింది. పోటీగా ఏ సినిమా లేకపోవడంతో చాలా వరకు థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. కార్తీ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ నమోదవుతుండటం విశేషం. అయితే కథ పరంగా చూసుకుంటే.. ఎటువంటి కొత్తదనం ఉండదు. తల్లి మరణానికి కారణమైన తండ్రి పై పగ తీర్చుకోవడమే ఈ చిత్రం కథ. ఇలాంటి కథతో ప్రభాస్ ఓ సినిమా చేశాడు అదే ‘మున్నా’.వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకుడు.

నిజానికి అంతకు ముందే వెంకటేష్ ‘సూర్య ఐపీఎస్’ కూడా ఇదే కథతో వచ్చింది. ఇక నాగార్జున ‘వారసుడు’, కళ్యాణ్ రామ్ ‘పటాస్’ సినిమాల్లో కూడా ఇలాంటి పాయింట్ ఉంటుంది. రెగ్యులర్ స్టోరీనే అయినప్పటికీ తమిళ నేటివిటీకి తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుంది. అందుకే రివ్యూలు కూడా చాలా నెగిటివ్ గా వచ్చినప్పటికీ ఈ మూవీ అక్కడ కమర్షియల్ సక్సెస్ అందుకుంది.

దీంతో డిస్ట్రిబ్యూటర్లలో ఒకరైన శక్తి వేలన్.. నిర్మాత సూర్య,హీరో కార్తీలకు డైమండ్ బ్రాస్లెట్స్ ను బహుమతిగా అందించాడు. దర్శకుడు ముత్తయ్యకి డైమండ్ రింగ్ ను గిఫ్ట్ గా అందించడం విశేషం.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus