వంటలక్క, డాక్టర్ బాబు, మోనిత.. ఈ పేర్లు తెలుగు జనాలకు బాగా అలవాటు అయిపోయాయి. అందుకే ‘కార్తీక దీపం’ సీరియల్‌లో ఈ ముగ్గురూ మిస్ అయ్యేసరికి.. ఏదో వెలితిగా ఫీల్ అయ్యారు. సీరియల్‌లో రక్తి కట్టించే సీన్స్ చాలానే వస్తున్నా ఆ ముగ్గురూ లేరనే బాధ ఉండిపోయింది. అలాంటి వారికి వాళ్లు రీఎంట్రీ ఇచ్చి వావ్ అనిపిస్తున్నారు. అయితే దీనికి మించిన మరో ఆనందకరమైన న్యూస్ ఇప్పుడు మేం మీకు చెబుతున్నాం.
ఇన్నాళ్లూ బుల్లి తెర మీద చూసినా.. వంటలక్క కథ.. త్వరలో వెండితెర మీదకు వస్తుందట. అవును, మీరు చదివింది కరెక్టే. ‘కార్తీక దీపం’ సీరియల్‌ను సినిమాగా మలచాలని టీమ్ అనుకుంటోందని టాక్. ఇన్నాళ్లూగా టీవీ రంగానికికి బాహుబలిగా నిలిచిన ఈ సీరియల్ ఇప్పుడు వెండితెరకు తీసుకొస్తారని టాక్. సీరియల్‌కి ఉన్న ఫేమ్‌ను క్యాష్ చేసుకోవడానికి ఈ పని చేస్తున్నారని అంటున్నారు. ఇందులో కూడా ఆ సీరియల్ నటులే ఉంటారని అంటున్నారు. అయితే కొంతమంది కొత్తవాళ్లను కూడా తీసుకునే అవకాశం ఉందట.
‘కార్తీక దీపం’ సినిమాను నెట్ ఫ్లిక్స్ స్పెషల్‌గా తీసుకొస్తారనే పుకారు మరోవైపు వినిపిస్తోంది. సీరియల్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్, మా టీవీలో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఐదేళ్లుగా సా…గుతున్న ఈ సీరియల్‌ని రెండున్నర గంటలు సినిమాలా ఎలా మలుస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తం సీరియల్‌ని యాజ్ ఇట్ ఈజ్‌గా తీస్తారా? లేక పాయింట్‌ను మాత్రం పట్టుకుని సినిమా కోసం వేరే కథ రాసుకుంటారా అనేది చూడాలి.
ఇక ‘కార్తీకదీపం’ సీరియల్ తొలుత మలయాళంలో ‘కరుతముత్తు’ అనే సీరియల్‌గా రూపొందింది. ఆ తర్వాత కన్నడలో ‘ముద్దు లక్ష్మి’, తమిళంలో ‘భారతీ కన్నమ్మ’, మరాఠీలో ‘రంగ్ మజా వెగ్లా’, హిందీలో ‘కార్తీక్ పూర్ణిమ’గా తీసుకొచ్చారు. తెలుగులో దీపగా ప్రేమీ విశ్వనాథ్, కార్తిక్‌గా నిరుపమ్ పరిటాల నటిస్తున్నారు. మోనితగా శోభ శెట్టి, హిమగా బేబీ సహ్రు, శౌర్యగా బేబీ కార్తీక, సౌందర్యగా అర్చనా అనంత్ చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు వచ్చిన సెకెండ్ జనరేషన్ ఎపిసోడ్లలో నిరుపమ్‌గా మానస్, హిమగా కీర్తి కేశవ్ భట్, శౌర్యగా అమూల్య గౌడ నటిస్తున్నారు.
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?