Karthika Deepam: ‘కార్తీక దీపం’ టి.ఆర్.పి రేటింగ్ దారుణంగా పడిపోయిందిగా..!

చెప్పుకోడానికి పాత కథే.. అయినప్పటికీ పాత్రల పనితీరు కొత్తగా ఇంట్రెస్టింగ్ గా ఉండడం వల్ల బుల్లితెర బాహుబలి అయిపోయింది ‘కార్తీక దీపం’ సీరియల్. ఇండియన్ వైడ్ స్మాల్ స్క్రీన్ పై రికార్డ్ టి.ఆర్.పి రేటింగ్ లను నమోదు చేసిన ఘనత ఈ సీరియల్ కే చెల్లింది.దాంతో పాటు ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు’ అనే రేంజ్లో ‘వంటలక్క- డాక్టర్ బాబు ఎప్పుడు కలుస్తారు?’ అనే ప్రశ్న కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది.

మొత్తానికి ప్రేక్షకుల కోరిక తీరింది వంటలక్క, డాక్టర్ బాబు లు కలిసిపోయారు. మౌనిత జైలుకి కూడా వెళ్ళింది. అక్కడి వరకు ఈ సీరియల్ టి.ఆర్.పి రేటింగ్ లు కూడా భారీగానే ఉన్నాయి. కానీ ఆ విలన్ ను మళ్ళీ బయటకి తీసుకొచ్చేసి.. ఆమె డాక్టర్ బాబు వల్ల బిడ్డను కనింది అనే సమస్యతో ఎపిసోడ్లు లాగిస్తూ వస్తున్నాడు దర్శకుడు.అంతేకాకుండా మళ్ళీ వంటలక్క శోకసంద్రంలో మునిగిపోతుంది. ఇవన్నీ ప్రేక్షకులకి బోర్ కొట్టేసినట్టు ఉన్నాయి…

‘కార్తీక దీపం’ సీరియల్ జోలికి వాళ్ళు పోవడం లేదు. దాంతో రేటింగ్ లు కూడా దారుణంగా పడిపోయాయి. ఒకప్పుడు ‘బిగ్ బాస్’ టెలికాస్ట్ అయినా కొత్త సినిమాలు టెలికాస్ట్ అయినా, ఇంకా చెప్పాలంటే జబర్దస్త్ ను మించే టి.ఆర్.పి రేటింగ్ నమోదు చేసేది ‘కార్తీక దీపం’. కానీ ఇప్పుడు 10వ సారి రిపీట్స్ లో టెలికాస్ట్ అయ్యే సినిమాల రేటింగ్ ను కూడా నమోదు చేయలేకపోతుందట. మరి దర్శకుడు పంధా మార్చి ఏమైనా రసవత్తరంగా నడిపిస్తాడో లేక ముగించేస్తాడో చూడాలి.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus