Karthika Nair: పెళ్లి లో సందడి చేసిన మెగాస్టార్..వైరల్ అవుతున్న ఫోటోలు!

నాగచైతన్య హీరోగా నటించిన జోష్ సినిమాతొ హీరోయిన్ కార్తీక కూడా వెండితెరకు పరిచయమయ్యింది కార్తీక. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధా వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీక..పెద్దగా అవకాశాలు సాధించలేకపోయింది. సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం రాణించలేదు పరిశ్రమలో నిలబడలేక పోయింది. సినిమాలు మానేసి ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న తమ ఫ్యామిలీ హోటల్స్ బిజినెస్ లు చూసుకుంటూ బిజినెస్ ఉమెన్ గా మారిపోయారు. ఇక రీసెంట్ గా తన పెళ్ళికి సబంధించిన హింట్ ఇచ్చిన బ్యూటీ..

చేతికి ఉంగరం తొడిగి ఉన్న ఫోటోని షేర్ చేసి ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ప్రకటించింది. తాను ప్రేమించి రోహిత్ మీనన్ ను త్వరలో పెళ్ళాడబోతున్నట్టు అప్పుడే తెలిపిన ఆమె.. తాజాగా రోహిత్ తో మూడు ముళ్లు వేయించుకుని.. ఏడడుగులు వేసింది. కేరళలోని త్రివేండ్రంలో జరిగిన ఈ వివాహానికి అలనాటి తారలంతా హాజరయ్యి కొత్త జంటకి దీవెనలు అందించారు. మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, సుహాసిని, రాధిక, రేవతి.. తదితరులు ఈ పెళ్లి వేడుకలో కనిపించి సందడి చేశారు.

చాలా కాలం తరువాత వీరు కలవడంతో అంతా కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. పెళ్ళి మండపంలో సినీ తారలతో వాతావరణం సందడిగా మారింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. తమిళంలో పలు చిత్రాల్లో నటించింది కార్తీక. రంగం చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్ బ్లాస్టర్ సొంతం చేసుకుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దమ్ము చిత్రంలో కూడా నటించి మెప్పించింది. ఆ తర్వాత (Karthika Nair) కార్తీకకి సరైన అవకాశాలు రాలేదు.

https://twitter.com/BeziqueStreams/status/1726485634767024465

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus