Karthikeya 2: నిఖిల్ రేంజ్ పెరిగిపోయిందిగా..?

యంగ్ హీరో నిఖిల్ నటించిన ‘కార్తికేయ2’ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడి ఫైనల్ గా ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకొచ్చింది. పెద్దగా అంచనాలు లేని ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. నాల్గో వారంలో కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా ఉంది. నార్త్ లో అయితే ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. ఉత్తరాదిన మెయిన్ సిటీస్ ముంబై లాంటి నగరాల్లో ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది.

ముంబైతో పాటు గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆగ్రా, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో నిఖిల్ జోరు మాములుగా లేదు. సోషల్ మీడియాలో మద్దతు బాగా పెరిగిపోవడం సినిమాకి ప్లస్ అయింది. ఇప్పటికే పలు రికార్డులు బద్దలు కొట్టిన ఈ సినిమా తాజాగా మరో ఘనత సొంతం చేసుకుంది. హిందీ డబ్బింగ్ వెర్షన్స్ లో టాప్ 10 కలెక్షన్స్ లో చోటు దక్కించుకుంది ఈ సినిమా. అది కూడా ఇంకా ఫుల్ రన్ పూర్తి కాకుండానే.

పదో స్థానంలో ఉన్న సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కబాలి’కి రూ.28 కోట్లు కలెక్షన్స్ రాగా.. నిఖిల్ ‘కార్తికేయ2’కి రూ.29 కోట్లు వచ్చాయి. అంటే రజినీకాంత్ ని దాటేసి తొమ్మిదో స్థానాన్ని దక్కించుకుంది. మాధవన్ ‘రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్’ సినిమాకి రూ.26 కోట్లతో పదకొండో ప్లేస్ లో ఉంది. ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమా 13వ ర్యాంక్ లో రూ.19 కోట్ల 30 లక్షల దగ్గర ఆగిపోయింది.

ఈ వారంలో ‘బ్రహ్మాస్త్ర’ లాంటి భారీ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టాక్ బాగుంటే మాత్రం ఇక ‘కార్తికేయ2’ కలెక్షన్స్ డ్రాప్ అవ్వడం ఖాయం. ఒకవేళ టాక్ అటుఇటుగా ఉంటే మాత్రం మళ్లీ ‘కార్తికేయ2’ పుంజుకునే ఛాన్స్ ఉంది. మరేం జరుగుతుందో చూడాలి!

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus