Karthikeya 2 OTT: ఆ ఓటీటీలో కార్తికేయ2 స్ట్రీమింగ్ కానుందా?

టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన నిఖిల్ నటించిన కార్తికేయ2 సినిమా భాషతో సంబంధం లేకుండా అన్ని భాషలలో ఊహించని రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తూ ఫ్యాన్స్ ను ఆశ్చర్యానికి గురి చేస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ అయిన ఈ సినిమా ఫుల్ రన్ లో 30 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుని నిర్మాతలకు, బయ్యర్లకు భారీ లాభాలను అందించే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమయ్యాయి.

మరోవైపు కార్తికేయ2 మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థలలో ఒకటైన జీ5 కొనుగోలు చేసిందని బోగట్టా. ఈ హక్కుల కోసం జీ5 భారీగానే ఖర్చు చేసిందని సమాచారం అందుతోంది. ఈ సినిమా ఆరు వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఆలస్యంగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండటంతో ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. నిఖిల్ కార్తికేయ2 సినిమాతో పాన్ ఇండియా హీరోల జాబితాలో చేరినట్టేనని చెప్పవచ్చు.

హిందీలో ఈ సినిమాకు థియేటర్ల సంఖ్య పెరగడంతో పాటు ఈ సినిమాకు బుకింగ్స్ బాగున్నాయి. అటు నిఖిల్ కు ఇటు చందూ మొండేటికి ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ ఖాతాలో చేరింది. బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ఈ సినిమాలో నటించడం కూడా ఈ సినిమాకు ఒకింత ప్లస్ అయింది. 2022 బిగ్గెస్ట్ హిట్లలో కార్తికేయ2 సినిమా కూడా ఒకటని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. గత నెలలోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వేర్వేరు కారణాల వల్ల రిలీజ్ డేట్లను మార్చుకుని ఈ నెలలో థియేటర్లలో విడుదలైంది.

రోజురోజుకు ఈ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల సంఖ్య పెరుగుతుందే. లైగర్ సినిమా రిలీజయ్యే వరకు థియేటర్లలో కార్తికేయ2 సినిమా హవా కొనసాగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. నిఖిల్ తర్వాత ప్రాజెక్ట్ లపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus