Karthikeya 2, Sita Ramam: ‘సీతా రామం’ ని చిన్న చూపు చూసిన నేషనల్ అవార్డ్స్ బృందం.. ఎందుకు?

ఈరోజు 79 వ జాతీయ చలనచిత్ర అవార్డుల జాబితాని వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కార్తికేయ 2’ (Karthikeya 2) నిలిచింది. తెలుగు సినిమాల్లో కేవలం ‘కార్తికేయ 2’ కి మాత్రమే అవార్డు లభించింది. 2022 లో విడుదలైన చిత్రాలకి గాను ఈ అవార్డుల జాబితాని వెల్లడించడం జరిగింది. వాస్తవానికి 2022 లో చాలా మంచి సినిమాలు వచ్చాయి. ‘అంటే సుందరానికీ’ (Ante Sundaraniki) ‘విరాటపర్వం’ (Virata Parvam) ‘సీతా రామం’ (Sita Ramam)వంటి మంచి సినిమాలు చాలా వచ్చాయి.

Karthikeya 2, Sita Ramam

పోనీ ‘అంటే సుందరానికీ’ ‘విరాటపర్వం’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు..! అవార్డులు ఇవ్వడానికి సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలనే రూల్ కూడా లేదు. అది వేరే విషయం. సరే వాటిని పక్కన పెట్టినా.. ‘సీతా రామం’ సినిమాకి ఎందుకు నేషనల్ అవార్డు లభించలేదు. ఈ ప్రశ్న చాలా మందిని వెంటాడుతోంది. ‘సీతా రామం’… కథ పరంగా, టెక్నికల్ వాల్యూస్ పరంగా, మ్యూజిక్ పరంగా, క్యాస్టింగ్ పరంగా కూడా…

అన్ని విధాలుగా రిచ్ గా ఉంటుంది. మంచి ఎమోషన్స్ కూడా ఉంటాయి. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ మూవీ బాగా ఆడింది.తెలుగు, మలయాళంలో మాత్రమే కాదు లేట్ గా రిలీజ్ అయినప్పటికీ హిందీలో కూడా సక్సెస్ అయ్యింది.అయినా ఎందుకో నేషనల్ అవార్డ్స్ బృందం దీన్ని చిన్న చూపు చూసింది. ఇక ‘కార్తికేయ 2’ కూడా కమర్షియల్ సక్సెస్ సాధించిన మూవీనే..! కాదనలేం..! కానీ కృష్ణుడి గొప్పతనాన్ని అనుపమ్ ఖేర్ వివరించే సన్నివేశం తీసేస్తే..

అందులో ‘పెద్ద విషయం ఉన్నట్టు అనిపించదు’ అనేది కొందరి వాదన. ‘ఇది ఓవర్ హైప్డ్ మూవీ’ అని కూడా చాలా మంది తెలుగు ప్రేక్షకులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతుంటారు. అయినప్పటికీ నార్త్ జనాలు దాన్ని నెత్తిన పెట్టుకున్నారు.. కాబట్టి హిందుత్వానికి పెద్దపీట వేస్తూ..’కార్తికేయ 2′ కి నేషనల్ అవార్డు కట్టబెట్టి ఉంటారు అని చాలా మంది భావిస్తున్నారు. సో నెక్స్ట్ ‘హనుమాన్'(Hanu Man)  కి కూడా నేషనల్ అవార్డు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదేమో..!

‘ఆయ్’ మూవీ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus