Karthikeya: చిరంజీవి పై వస్తున్న విమర్శలను ఖండించిన నటుడు కార్తికేయ!

ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటుడు కార్తికేయ.ఇలా నటుడిగా పలు సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నటువంటి ఈయన త్వరలోనే బెదురు లంక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పలు ఇంటర్వ్యూలకు ఈయన హాజరయ్యారు. ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి కార్తికేయ మెగాస్టార్ చిరంజీవి గురించి వస్తున్నటువంటి విమర్శలపై స్పందించారు.

ఈ సందర్భంగా కార్తికేయ (Karthikeya) మాట్లాడుతూ చిరంజీవి సినిమా ఫ్లాప్ అయితే ఇలా ఆయన పట్ల విమర్శలు రావడం చాలా బాధాకరమని తెలిపారు. సినిమా నచ్చితే చూడాలి నచ్చకపోతే బాగోలేదని చెప్పాలి అంతేకానీ వ్యక్తిగతంగా విమర్శలు చేయడం మంచిది కాదని చిన్న మనస్తత్వం ఉన్నటువంటి వారే ఇలాంటివి చేస్తారని ఆయన తెలిపారు. చిరంజీవి గారు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ స్థాయిలో ఉన్నారు.

అలాంటి ఆయన కష్టాల ముందు ఇలాంటివి చాలా చిన్నవని తెలిపారు. ఇలా చిరంజీవి గారి గురించి వస్తున్నటువంటి ఈ విమర్శలను ఆయన ఏమాత్రం పట్టించుకోకుండా తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెడతారనే విషయం అందరికీ తెలిసిందే.అయినప్పటికీ ఆయన పట్ల ఇలాంటి విమర్శలు రావడం అందరికీ కాస్త బాధ కలిగిస్తున్నాయంటూ ఈ సందర్భంగా కార్తికేయ చిరంజీవి గురించి వస్తున్నటువంటి విమర్శలపై స్పందిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus