Karthikeya Collections: ‘కార్తికేయ’ కి 10 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్!

నిఖిల్ (Nikhil Siddhartha), స్వాతి రెడ్డి (Swathi Reddy) హీరో హీరోయిన్లుగా ‘స్వామిరారా’ (Swamy Ra Ra) తర్వాత చేసిన చిత్రం ‘కార్తికేయ’ (Karthikeya) . చందూ మొండేటి (Chandoo Mondeti) డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ‘మాగ్నస్ సినీ ప్రైమ్’ బ్యానర్ పై వెంకట శ్రీనివాస్ (Venkata Srinivas) నిర్మించారు. రావు రమేష్ (Rao Ramesh) , తనికెళ్ళ భరణి (Tanikella Bharani) , జయప్రకాష్(Jayaprakash) ,తులసి (Tulasi) ,సత్య (Satya Akkala), రాజా రవీంద్ర (Raja Ravindra) ,ఛత్రపతి శేఖర్ (Chatrapathi Sekhar)..లు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. స్నేక్ హిప్నటైజేషన్ కాన్సప్ట్ తో రూపొందిన ఈ చిత్రం ఆడియన్స్ కి ఓ సరికొత్త ఫీల్ ను కలిగించింది.

Karthikeya Collections:

థ్రిల్లింగ్ మూమెంట్స్, శేఖర్ చంద్ర మ్యూజిక్ వంటి ‘కార్తికేయ’ లో హైలెట్స్ అని చెప్పాలి. పెద్దగా చప్పుడు లేకుండా 2014 అక్టోబర్ 24 న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్నే అందుకుంది. నేటితో ‘కార్తికేయ’ రిలీజ్ అయ్యి 10 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా ‘కార్తికేయ’ (Karthikeya ) ఫైనల్ కలెక్షన్స్ ఎంతో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 2.52 cr
సీడెడ్ 0.85 cr
ఉత్తరాంధ్ర 0.88 cr
ఈస్ట్ 0.40 cr
వెస్ట్ 0.25 cr
గుంటూరు 0.50 cr
కృష్ణా 0.35 cr
నెల్లూరు 0.12 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 5.87 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.27 cr
ఓవర్సీస్ 0.65 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 6.79 cr

‘కార్తికేయ’ చిత్రం రూ.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో రూ.6.79 కోట్ల షేర్ ను రాబట్టి… రూ.1.79 కోట్ల ప్రాఫిట్స్ తో క్లీన్ హిట్ గా నిలిచింది.

తిరుమలలో సందడి చేసిన దిల్ రాజు ఫ్యామిలీ.. వీడియో వైరల్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus