Dil Raju: తిరుమలలో సందడి చేసిన దిల్ రాజు ఫ్యామిలీ.. వీడియో వైరల్!

టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ లో ఒకరైన దిల్ రాజు (Dil Raju)  .. నిత్యం బిజీగా ఉంటుంటారు. సినిమాలతోనే కాకుండా.. డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలు లేడు అంటే చాంబర్లో మీటింగులు అంటూ తిరుగుతూనే ఉంటారు దిల్ రాజు. ఆయన నిర్మాణంలో రూపొందిన ‘జనక అయితే గనక’  (Janaka Aithe Ganaka) చిత్రం ఇటీవల రిలీజ్ అయ్యింది. అలాగే దిల్ రాజు నిర్మాణంలో 50 వ సినిమాగా రూపొందిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కాబోతోంది.

Dil Raju

వెంకటేష్  (Venkatesh)  – అనిల్ రావిపూడి (Anil Ravipudi)..లతో చేస్తున్న సినిమా కూడా దాదాపు అదే టైంలో రిలీజ్ కావచ్చు.అయితే దిల్ రాజు ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆయన ఫ్యామిలీకి క్వాలిటీ టైం ఇస్తూనే ఉంటారు. ఆయన ఫ్యామిలీ ఫోటోలు కూడా నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. ఇదిలా ఉండగా.. దిల్ రాజుకి (Dil Raju) శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే భక్తి ఎక్కువ. ఏడాదికి ఒక్కసారైనా తిరుమల వెళ్లి స్వామి వారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించుకుని వస్తుంటారు.

తాజాగా మరోసారి కుటుంబంతో కలిసి తిరుమల వెళ్లొచ్చారు దిల్ రాజు (Dil Raju). ఆయన సతీమణి తేజస్విని అలియాస్ వైఘా రెడ్డి, కొడుకు అన్వి రెడ్డి..లు దిల్ రాజుతో కలిసి తిరుమల వెళ్లడం జరిగింది. ఇక స్వామివారి సన్నిధిలో దిల్ రాజు ఫ్యామిలీ నడిచి వస్తున్న వీడియో ఒకటి వైరల్ అయ్యింది. వైఘా రెడ్డి గ్రీన్ కలర్ పట్టు చీరలో కనిపించారు. ఇక అన్వి రెడ్డి దారి పొడుగునా ఆటలు ఆడుతూ ముద్దు ముద్దు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. అవి చాలా క్యూట్ గా ఉన్నాయి.

స్పెషల్‌ డే నాడు ‘సలార్‌ 2’ అప్‌డేట్‌ రాలేదు ఎందుకు? ఏమైంది?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus