Sardar: కార్తి లిస్ట్ లో సీక్వెల్ మీద సీక్వెల్!

దీపావళి పండగ సందర్భంగా కార్తి నటించిన ‘సర్ధార్’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. వసూళ్ల పరంగా కూడా ఈ సినిమా సత్తా చాటుతోంది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ చేయడానికి కార్తి అండ్ టీమ్ రెడీ అవుతోంది. చెన్నైలో జరిగిన ఓ ప్రెస్ మీట్ లో చిత్రబృందం ఈ విషయాన్ని వెల్లడించింది. ‘సర్ధార్’ క్లైమాక్స్ లో దీనికి సీక్వెల్ ఉంటుందని వెల్లడించారు.

సీక్వెల్ కి ‘సర్ధార్ పార్ట్ 2’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. దానికి కూడా పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించనున్నారు. కార్తీనే హీరోగా నటించనున్నారు. ఈ సీక్వెల్ తో కలిపి కార్తి చేతిలో మొత్తం మూడు సీక్వెల్స్ ఉన్నాయని చెప్పాలి. ముందుగా ‘ఖైదీ’ సీక్వెల్ గురించి చెప్పుకోవాలి. వచ్చే ఏడాది నుంచి ‘ఖైదీ2’ సెట్స్ పైకి వెళ్తుందని కార్తి చెప్పారు. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ‘ఖైదీ’ సినిమా తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది.

కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమా క్లైమాక్స్ లో ‘ఖైదీ’లో ఢిల్లీ పాత్రను చూపించారు. నిజానికి ‘ఖైదీ’ సినిమాను ఎప్పుడో అనౌన్స్ చేశారు కానీ లోకేష్ వేరే ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడంతో ‘ఖైదీ2’ ఆలస్యమైంది. దీంతో పాటు ‘పొన్నియిన్ సెల్వన్’ సీక్వెల్ లో నటించనున్నారు కార్తి. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చింది. ఇప్పటికే సీక్వెల్ షూటింగ్ కూడా కంప్లీట్ అయింది.

వచ్చే ఏడాదిలో సినిమా విడుదల కానుంది. ఇక కార్తి విషయానికొస్తే.. వరుస సక్సెస్ లతో కార్తి మార్కెట్ పెరిగిందని చెబుతున్నారు ట్రేడ్ పండితున్నారు. ఇప్పుడు కార్తి చేతిలో మొత్తం నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో మూడు సీక్వెల్స్ కాగా.. మరొకటి రాజు మురుగన్ దర్శకత్వం వహించే సినిమా.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus