సినిమా ఇండస్ట్రీలో ఒక హిట్టు పడితే చాలు.. రెమ్యునరేషన్ ఆటోమేటిక్ గా పెంచేస్తారు హీరోలు. హీరోల డిమాండ్ ని బట్టి రెమ్యునరేషన్ పెరుగుతూ ఉంటుంది. బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ కి ఈ మధ్యకాలంలో క్రేజ్ బాగా పెరిగిపోయింది. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న ఈ హీరో బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘ప్యార్ కా పంచనామా’ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు కార్తిక్ ఆర్యన్.
ఆ సినిమాకి కేవలం రూ.1.25 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నారు ఈ హీరో. ఇప్పుడు ఒక్కో సినిమాకి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. అక్షరాల రోజుకి రూ.2 కోట్లు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని కార్తిక్ స్వయంగా వెల్లడించారు. కరోనా సమయంలో కార్తిక్ ఒక్క సినిమా కోసం రూ.20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ విషయంపై తాజాగా ఆయన స్పందించారు. ఆ వార్తలు నిజమేనని అన్నారు.
కరోనా లాక్ డౌన్ సమయంలో తనొక సినిమా చేశానని.. ఆ సినిమాకి గాను రూ.20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నానని చెప్పారు. ఈ సినిమా షూటింగ్ కేవలం 10 రోజుల్లో కంప్లీట్ చేశానని అన్నారు. ఆ సినిమా వల్ల నిర్మాతలకు మంచి లాభం వచ్చిందని.. కాబట్టి అంత పారితోషికం తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదనిపించిందని అన్నారు. ఇక తన సినిమాల గురించి కార్తిక్ ఆర్యన్ కీలక విషయాలు వెల్లడించారు.
గతేడాది తను చేసిన హారర్ కామెడీ సినిమా ‘భూల్ భులయ్యా2’ మంచి సక్సెస్ అందుకుంది.. తను కూడా కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నానని.. ప్రేక్షకులను అలరించే కథలకే ఓకే చెబుతున్నానని అన్నారు. తన కష్టాన్ని తెర మీద చూస్తున్నారు కాబట్టే ప్రేక్షకులు తనను బాగా ఆదరిస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కార్తిక్ ఆర్యన్ ‘షెహజాదా’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇది ‘అల వైకుంఠపురములో’ సినిమా రీమేక్ గా తెరకెక్కుతోంది.
వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?