’90.ఎం.ఎల్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్..!

‘ఆర్.ఎక్స్.100’ ఫేమ్ కార్తికేయ హీరోగా ‘కార్తికేయ క్రియేటివ్ వర్క్స్’ బ్యానర్ పై అశోక్ రెడ్డి గుమ్మరికొండ నిర్మించిన తాజా చిత్రం ’90.ఎం.ఎల్’. శేఖర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 6న విడుదలయ్యింది. మద్యం తాగకపోతే చనిపోయే.. డిజార్డర్ ఉన్న హీరోకి తన ప్రేమ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారుతుంది. చివరికి దానిని హీరో ఎలా ఓవర్ రైడ్ చేసాడు అన్నది మిగిలిన కథ. అయితే మొదటి షో తోనే ఈ చిత్రం మిక్స్డ్ టాక్ ను మూటకట్టుకుంది. కానీ టీజర్, ట్రైలర్ లతో మొదటినుండీ ఈ చిత్రం పై మంచి క్రేజ్ ఏర్పడడంతో మొదటి వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకుందని చెప్పాలి.

నైజాం 0.58 cr
సీడెడ్ 0.24 cr
ఉత్తరాంధ్ర 0.27 cr
ఈస్ట్ 0.15 cr
వెస్ట్ 0.11 cr
కృష్ణా 0.15 cr
గుంటూరు 0.14 cr
నెల్లూరు 0.10 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.06 cr
ఓవర్సీస్ 0.05 cr
వరల్డ్ వైడ్ టోటల్ 1.85 cr (share)

ఈ చిత్రానికి 3.5 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టు ట్రేడ్ పండితుల సమాచారం. ఇక మొదటి మూడు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1.85 లక్షల షేర్ ను రాబట్టింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే ఇంకా 1.70 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఆదివారం రోజున ఈ చిత్రం బాగా కలెక్ట్ చేసింది. అయితే సోమవారం నుండీ ఈ చిత్రానికి అసలు పరీక్ష మొదలుకానుంది. ఈ వారం పూర్తయ్యేసరికే ఈ చిత్రం మొత్తం రాబట్టుకోవాలి.. ఎందుకంటే డిసెంబర్ 13 నుండీ ‘వెంకీమామ’ వచ్చేస్తున్నాడు. మరి మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం ఎంత రాబడుతుందో చూడాలి.

24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ సాధించిన లిరికల్ సాంగ్స్ ఇవే!
30 సౌత్ ఇండియన్ హీరోయిన్లు మరియు వారి చైల్డ్ హుడ్ పిక్స్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus