Kartikeya: ఆహా కొత్త ప్రయత్నం.. ఫలిస్తుందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని చాలామంది హీరోలు తాము నటించిన సినిమా ఫ్లాప్ అని ఒప్పుకోవడానికి అస్సలు ఇష్టపడరు. అయితే కార్తికేయ మాత్రం తను నటించిన చావుకబురు చల్లగా సినిమా ఫ్లాప్ అని ఒప్పుకున్నారు. కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ఈ సినిమా గత నెల 19వ తేదీన థియేటర్లలో విడుదలైంది. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా నిర్మాతలు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు మాత్రం రాలేదు. 13 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా 5 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఈ సినిమా ఏప్రిల్ 23వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీ కోసం ఈ సినిమాను రీఎడిట్ చేసినట్టు దర్శకుడు కౌశిక్ తెలిపారు. కార్తికేయ చావుకబురు చల్లగా ఓటీటీ రిలీజ్ ప్రెస్ మీట్ లో పాల్గొని ఈ సినిమా తన మనస్సుకు దగ్గరైన సినిమా అని చెప్పారు. అనుకున్న స్థాయిలో ఈ మూవీ ఆడకపోవడంతో మొదటి మూడు రోజులు బాధ పడ్డానని పేర్కొన్నారు. సినిమా హిట్, ఫ్లాప్ మన చేతిలో ఉండదని కార్తికేయ అన్నారు.

తాను రొమాంటిక్ సన్నివేశాల్లో బాగా నటిస్తారని అందరూ అనుకున్నా విభిన్నమైన కథలు తన దగ్గరకు వస్తున్నాయని కార్తికేయ అన్నారు. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా విభిన్నమైన పాత్రలు చేయాలని అనుకుంటున్నానని ఓటీటీలో చూసిన వారికి చావుకబురు చల్లగా సినిమా నచ్చితే మేము ఎంతో సంతోషిస్తామని కార్తికేయ వెల్లడించారు. థియేటర్లలో ఫ్లాప్ అయిన సినిమాను రీఎడిట్ చేసి ఆహా ఓటీటీ చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందో లేదో చూడాల్సి ఉంది.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus