కాటమరాయుడులో మార్పులు చేసిన కధ లీకయింది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాక్షనిస్టుగా నటిస్తున్న చిత్రం కాటమరాయుడు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ కథను అజిత్ చేసిన తమిళ మూవీ వీరమ్ సినిమా నుంచి తీసుకున్నారు. అయితే పవన్ క్రేజ్, తెలుగుదనం జోడించి ఈ స్టోరీని మార్పులు చేశారు. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శరత్‌మరార్‌ నిర్మిస్తున్న ఈ సినిమాను డాలీ డైరక్ట్ చేస్తున్నారు. పవన్ సరసన శృతిహాసన్ నటిస్తున్న ఈ ఫిల్మ్ స్టోరీ లైన్ లీకైంది. ” ఫ్యాక్షన్ లీడర్ అయిన హీరోకు ఆడవాళ్లంటే పడదు. అంతేకాదు తన నలుగురు తమ్ముళ్ల బాగోగులు చూసుకోవాలని పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడు.

ఆ తమ్ముళ్లు మాత్రం ప్రేమలో పడతారు. ప్రేమను అన్నయ్య ఒప్పుకోడని భావించి.. అతడినే ఓ అమ్మాయి ప్రేమలోకి దించుతారు. తమ్ముళ్ల కోసం, ప్రేమించిన అమ్మాయికోసం కాటమరాయుడు ఎలా మారుతాడు” అనేది స్టోరీ. ఇందులో పవన్ కి తమ్ముల్లుగా కమల్ కామరాజు, విజయ్ దేవరకొండ, శివబాలాజీ, అజయ్ నటిస్తున్నారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఉగాది కానుకగా రిలీజ్ కానుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus