కొత్త సినిమా కథనం గురించి క్లారిటీ ఇచ్చిన అనసూయ
- February 1, 2019 / 09:34 AM ISTByFilmy Focus
“క్షణం, రంగస్థలం” సినిమాల్లో అనసూయ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత కేవలం ఆమె కోసమే ప్రత్యేకమైన పాత్రలు, కథలు రాయడం మొదలెట్టారు మన రచయితలు. అనసూయ కూడా తాను పోషించే పాత్రలను ఆచితూచి ఎంపిక చేసుకుంటుంది. అందులో భాగంగానే ఆమె “కథనం” అనే సినిమాలో నటిస్తోంది. ప్రొడక్షన్ & డైరెక్షన్ టీం అందరూ కొత్తవాళ్లే. ఈ చిత్రం మోషన్ పోస్టర్ రీసెంట్ గా విడుదలైంది. పోస్టర్ లోని లుక్ క్షణం సినిమాలో ఆమె పోషించిన పోలీస్ పాత్ర తరహాలో ఉండడంతో “కథనం” సినిమాలో కూడా అనసూయ పోలీస్ క్యారెక్టర్ ప్లే చేస్తుందనుకున్నారందరూ.
- స్నేహం వేరు.. పార్టీ వేరు’… పవన్ కళ్యాణ్ పై అలీ సంచలన కామెంట్లు..!
- ఆర్య – సయేషా.. పెళ్ళి డేట్ ఫిక్స్..!
- త్రివిక్రమ్, బోయపాటిలపై హేమ సెన్సేషనల్ కామెంట్స్

కట్ చేస్తే.. తాను “కథనం” చిత్రంలో అసిస్టెంట్ డైరెక్టర్ రోల్ ప్లే చేస్తున్నానని క్లారిటీ ఇచ్చింది అనసూయ. అలాగే విజయ్ దేవరకొండ ప్రొడక్షన్ లో రూపొందబోయే మొదటి సినిమాలో కూడా తనది గ్లామర్ రోల్ కాదని క్లారిటీ ఇచ్చింది అనసూయ. ప్రస్తుతం ఆమె చుట్టూ బోలెడన్ని ఆఫర్లు ఉన్నప్పటికీ.. ఆమెకు నచ్చిన సినిమాలు మాత్రమే చేస్తోంది.











