కోలీవుడ్ హీరోతో బాలీవుడ్ బ్యూటీ!

  • January 11, 2021 / 01:22 PM IST

కోలీవుడ్ లో చిన్న ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన విజయ్ సేతుపతి తన టాలెంట్ తో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు. కేవలం హీరో పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా క్యారెక్టర్ నచ్చితే విలన్ గా కూడా నటిస్తూ ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటున్నాడు. తన నటనతో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతితో సినిమాలు చేయడానికి ఇతర భాషల వారు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే తెలుగులో ‘ఉప్పెన’ సినిమాలో విలన్ గా నటించిన టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.

ఇప్పుడు బాలీవుడ్ లో కూడా సేతుపతికి ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ విలక్షణ దర్శకుడు ‘అంధాధూన్’ ఫేమ్ దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ విజయ్ సేతుపతిని హీరోగా పెట్టి ఓ భారీ బడ్జెట్ సినిమా తీయడానికి రెడీ అవుతున్నారు. ఇందులో మెయిన్ హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ నటించనుందని సమాచారం. కత్రినా లాంటి హీరోయిన్ విజయ్ సేతుపతి సినిమా సైన్ చేసిందంటే.. అతడి క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతోంది.

వీరిద్దరి కాంబినేషన్ వెండితెరపై కొత్త ఫీలింగ్ కలిగిస్తుందని దర్శకుడు భావిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలో నటించిన ‘మాస్టర్’ సినిమా రిలీజ్ కు సిధ్దంగా ఉంది. అలానే ఆయన హీరోగా ఏడెమినిది సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus