బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ గా మొదలైపోయింది. కింగ్ నాగార్జున హోస్ట్ గా గత ఆదివారం మొదలైన బిగ్ బాస్ సీజన్ 4 మొదటివారానికి దగ్గర పడుతుంది. మొదటివారం ఎలిమినేషన్స్ కి గాను మొత్తం 7గురు కంటెస్టెంట్స్ ఎంపిక కావడం జరిగింది. అందులో గంగవ్వ, జోర్దార్ సుజాత వంటివారు కూడా ఉన్నారు. హౌస్ లోకి ప్రవేశించిన చాలా మంది కంటెస్టెంట్స్ గురించి ప్రేక్షకులకు కనీస అవగాహనా లేదు. దీనితో షో ఏమంత రంజుగా లేదు.
ఆ కొత్త మొహాలు కొంచెం ప్రేక్షకులకు అలవాటైతే షోపై ఆసక్తి పెరిగే ఆస్కారం ఉంది. కాగా బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌషల్ ప్రస్తుత సీజన్ పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా గంగవ్వపై ఆయన ప్రశంశలు కురిపించారు. ఓ పల్లెటూరికి చెందిన వృద్ధురాలు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా బిగ్ బాస్ హౌస్ కి ఎంపిక కావడం గొప్ప విషయం అన్నారు. పల్లెటూరి ప్రేక్షకులకు దగ్గర కావడానికి ఆమెను ఎంపిక చేశారు అన్నారు.
అలాగే ఆమె కనీసం 10వారాలకు పైనే హౌస్ లో కొనసాగుతుందని జోస్యం చెప్పారు. ఇక ఈ సారి హౌస్ లోకి ప్రవేశించిన ఇంటి సభ్యులు అందరూ తెలియనివారు కావడం వలన షోపై అంతగా ఆసక్తి లేదు అన్నారు. లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా ఏర్పడిన ఆర్థిక ఇబ్బందుల వలన చాలా మంది హౌస్ లోకి ప్రవేశించడానికి ఆసక్తి చూపలేదు అన్నారు.
Most Recommended Video
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్ 4 హైలెట్స్: బిగ్‌బాస్ ఇలా రోజూ అయితే కష్టమే!
బిగ్‌బాస్ 4: ఇంట్లో వాళ్లు ఒకరు… బయటి నుంచి ముగ్గురట!