Kaushal wife Neelima: ‘బిగ్ బాస్’ విన్నర్ కౌశల్ భార్య హెల్త్ కండిషన్‌ పై షాకింగ్ వీడియో..!

‘బిగ్ బాస్ 2’ విన్నర్ అయిన కౌశల్ ఇటీవల తన భార్య నీలిమను ఉద్దేశిస్తూ ఓ పోస్ట్ పెట్టాడు. ‘ ఏదో సాధించాలని వెళ్ళావు. ఏదో ఒకటి చేసేందుకు నీ లైఫ్ తో ఫైట్ చేస్తున్నావు. నీ ధైర్యం గురించి నాకు తెలుసు. నువ్వు కచ్చితంగా అనుకున్నది సాధిస్తావ్. త్వరగా కోలుకో. నువ్వు కన్న నీ కలల కోసం పోరాడి.. గెలిచి రా.. లవ్ యూ.. మిస్ యూ’ అంటూ కౌశల్ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. దీంతో కౌశల్ అభిమానులు తన భార్యకు ఏమైంది? అంటూ ఆందోళన చెందుతున్నారు.గతంలో నీలిమకు క్యాన్సర్ అని.. ఇదివరకే సర్జరీ అయ్యిందని కౌశల్ ఓ సందర్భంలో చెప్పడంతో.. అభిమానులు ఆందోళన మరింత ఎక్కువైందని చెప్పొచ్చు. ప్రస్తుతం నీలిమ యూకే లో జాబ్ చేస్తూ అక్కడే ఉంటుంది. అయితే ఇటీవల ఆమెకు కరోనా సోకిందట. ఆ పరిస్థితిని వివరిస్తూ ఆమె ఓ వీడియోని పోస్ట్ చేసింది.

నీలిమ ఆ వీడియో ద్వారా మాట్లాడుతూ.. “హాయ్.. అంతా బాగున్నారా.? ఇప్పుడు మీకందరికీ తెలియని విషయం ఒకటి చెప్పబోతున్నాను. ఇటీవల నాకు కోవిడ్ వచ్చింది. వారం రోజులుగా నేను కోవిడ్‌తో బాధపడుతున్నాను. ప్రస్తుతం నేను యూకేలో ఉన్నాను.ఇప్పుడున్న పరిస్థితుల్లో యూకే సేఫ్ కంట్రీ కదా.. ఇక్కడ కేసులు లేవు అనుకున్నాను. నాకు కోవిడ్ వస్తుందని అస్సలు అనుకోలేదు. నేను వర్క్ చేస్తున్న ప్లేస్‌లో వేరే వాళ్ళు కరోనా భారిన పడటంతో చివరికి అది నాకు కూడా సోకింది.నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే.. ఇండియాలో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అంటున్నారు కదా.. అక్కడి కంటే యూకేలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది.ఇక్కడ కేసులు తక్కువే అయినప్పటికీ.. ఒక్కసారి ఎటాక్ అయితే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందనేది చెప్పాలనుకుంటున్నా..! నాకు కోవిడ్ సోకినా తర్వాత బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది.. చెస్ట్ మొత్తం పెయిన్.. ఆయాసం ఎక్కువగా వచ్చేది. ఆ టైంలో నేను ఎన్.హెచ్.ఎస్ వాళ్లకు చెప్పాను.

నాకు ప్రాబ్లమ్‌గా ఉంది చూడండి అని. కానీ వాళ్లు పారాసెటమాల్ ప్రతి ఆరు గంటలకు ఒకసారి చొప్పున 1000 ఎంజీ వాడి చూడండి అన్నారు. అది తప్ప ఇక్కడ మరో వైద్యం లేదు. ప్రాబ్లమ్‌ ఇలా ఉంది అని ఎంత చెప్పినా.. వాళ్లు నా మాట వినలేదు. ఇక్కడ నేను చాలా గొప్పగా ఊహించుకున్నాను.. కానీ అలా ఏం లేదు. ఇండియాలో చిన్న ప్రాబ్లంకి వెంటనే స్పందిస్తారు. కానీ ఇక్కడి ట్రీట్ మెంట్ వెరీ బ్యాడ్ ఎక్స్ పీరియన్స్. అయితే భగవంతుడి దయవల్ల నాకు సెట్ అయ్యింది. ఒక రకంగా ట్రీట్మెంట్ విషయంలో ఇండియా చాలా బెటర్. మంచి మంచి డాక్టర్లు ఉన్నారు. అలా అని ఇక్కడ లేరని కాదు.. సిస్టమ్ ఫాలో అవ్వట్లేదు. మెడిసిన్ ఇవ్వడం లేదు.. కోవిడ్‌కి అయితే పారాసిటిమల్ మాత్రమే ఇస్తున్నారు. అది తప్ప ఇంకేం లేదు” అంటూ చెప్పుకొచ్చింది.


ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus