ఆ నటి ప్రవర్తనపై షాకింగ్ కామెంట్స్ చేసిన కవిత!

ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన కవిత కెరీర్ తొలినాళ్లలో వరుస సినిమాలలో చిరంజీవికి జోడీగా నటించి ప్రశంసలను సొంతం చేసుకున్నారు. వెంకన్న బాబు గారు నా డేట్స్ చూసేవారని ఆమె కామెంట్లు చేశారు. 4 సినిమాలలో నేను చిరంజీవికి కంటిన్యూగా జోడీగా చేశానని ఆమె చెప్పుకొచ్చారు. కృష్ణగారితో ఒక సినిమాలో ఛాన్స్ వచ్చినట్టే వచ్చి పోయిందని కవిత కామెంట్లు చేశారు. అప్పట్లో రెమ్యునరేషన్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యేవి కావని కవిత అన్నారు.

చిరంజీవి గారితో తర్వాత రోజుల్లో ఆఫర్లు రాలేదని ఆమె చెప్పుకొచ్చారు. జయసుధ, జయప్రద, శ్రీదేవితో ఆయన ఎక్కువగా నటించారని కవిత పేర్కొన్నారు. బాలయ్య బాబుతో చేయకపోవడానికి గల కారణాలను కవిత చెబుతూ వేర్వేరు కారణాల వల్ల కుదరలేదని కవిత కామెంట్లు చేశారు. రామకృష్ణా స్టూడియోస్ లో నేను మూడు సినిమాలు చేశానని కవిత అన్నారు. బాలకృష్ణ వచ్చే సమయానికి రాధ, భానుప్రియ, విజయశాంతి వచ్చారని అందుకే నేను ఆయనకు జోడీగా నటించడం సాధ్యం కాలేదని కవిత కామెంట్లు చేయడం గమనార్హం.

అమ్మ నాకు సంబంధించిన ప్రతి విషయాన్ని పట్టించుకున్నారని కవిత తెలిపారు. 17 సినిమాలను ఒకేసారి నేను వదిలేశానని ఆమె అన్నారు. ఆ సమయంలో నాకు పెళ్లి జరిగి సినిమాలకు బ్రేక్ తీసుకున్నానని కవిత పేర్కొన్నారు. జయచిత్ర గారి వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డానని ఆమె కామెంట్లు చేశారు. నిలబడి మాట్లాడాలని ఆమె సూచించేవారని కవిత చెప్పుకొచ్చారు. నేను షూటింగ్ ల సమయంలో అల్లరిగా ఉండేదానినని కవిత అన్నారు.

నా వాయిస్ వినపడకూడదని ఆమె రూల్స్ పెట్టేదని కవిత చెప్పుకొచ్చారు. రీఎంట్రీలో మాత్రం ఎవరు ఏమన్నా నేను లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చానని కవిత వెల్లడించారు. కవిత చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus