Kavya Kalyanram: కావ్య కల్యాణ్‌రామ్‌ కొత్త సినిమా… ఆ మెగా హీరోతోనే!

‘గంగోత్రి’ (Gangotri) సినిమాతో బాలనటిగా స్టార్‌ అయిపోయిన కావ్య కల్యాణ్‌రామ్‌ (Kavya Kalyanram).. ‘బలగం’ (Balagam) సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. కథానాయికగా తొలి సినిమాతోనే భారీ విజయం అందుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన వాళ్లు, ఫేమస్ అయిన బాల నటులు హీరోయిన్‌గా మారాక విజయాలు సాధించడం కష్టం అనే నానుడిని ఆమె కాదని నిరూపించింది. ‘మసూద’ (Masooda) లాంటి హారర్‌ జోనర్‌ సినిమాతో అదరగొట్టినా.. ‘బలగం’లో విలేజ్‌ లుక్ ఆమెకు బాగా నప్పింది అని కామెంట్స్‌ వచ్చాయి.

వాటి ఫలితమో, లేక పాత్ర నచ్చిందో కానీ.. మరోసారి అలాంటి పాత్రనే ఎంచుకుంది అని అంటున్నారు. వరుస ఆఫర్లు వస్తున్నా కావ్చ ఆచితూచి సినిమాలు ఓకే చేస్తోంది. ఈ క్రమంలో మెగా హీరో సరసన నటించే అవకాశం అందుకుందట. ‘హనుమాన్’ (Hanu Man)  సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మాణంలో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej)  హీరోగా ఓ సినిమా త్వరలో అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది. ఇప్పటికే ఈ సినిమా గురించి చెప్పాల్సి ఉన్నా వివిధ కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తోంది. రోహిత్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలోనే కావ్య నటిస్తోందని టాక్‌.

‘సంబరాల ఏటి గట్టు’ అనే డిఫరెంట్‌ టైటిల్‌ను సినిమాకు అనుకుంటున్నారని మరో టాక్‌ నడుస్తున్న ఆ సినిమాలో హీరోయిన్‌గా కావ్య కల్యాణ్‌ రామ్ అయితే బాగుంటుంది అని టీమ్‌ అనుకుంటోందట. ఈ మేరకు ఆమెను కాంటాక్ట్‌ అయ్యారని, ఆమె కూడా సుముఖంగా ఉంది అని చెబుతున్నారు. త్వరలో ఈ సినిమా అనౌన్స్‌ చేసి.. నెలాఖరులోగా సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తారట. అప్పుడు సినిమా హీరోయన్‌ అనౌన్స్‌మెంట్‌ కూడా ఉంటుంది అంటున్నారు.

ఇక సాయితేజ్‌ విషయానికొస్తే.. ‘విరూపాక్ష’ (Virupaksha) సినిమా తర్వాత ‘గాంజా శంకర్‌’ అనే సినిమా స్టార్ట్‌ చేశారు. అయితే బడ్జెట్‌, తదితర కారణాల వల్ల సినిమా ఆగిపోయింది అని టాక్‌. దీనిపై అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇప్పుడు నిరంజన్‌ రెడ్డి సినిమా కూడా అనౌన్స్‌ చేస్తారు అని చెప్పినా ఇంకా చేయలేదు. చూడాలి మరి ఏ సినిమా మొదలుపెడతాడో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus