‘పెళ్ళిచూపులు’ ‘ఈ నగరానికి ఏమైంది?’ వంటి రెండు కల్ట్ మూవీస్ ని అందించిన దర్శకుడు తరుణ్ భాస్కర్.. తర్వాత రూటు మార్చి ‘కీడా కోలా’ అనే క్రైమ్ కామెడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘విజి సైన్మా’ బ్యానర్ పై కె. వివేక్ సుధాంషు, సాయి కృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్..లు ఈ చిత్రాన్ని నిర్మించగా… రానా దగ్గుబాటి సమర్పకులుగా వ్యవహరించారు. టీజర్, ట్రైలర్స్ ప్రామిసింగ్ గా అనిపించాయి. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.
కానీ మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. కొన్ని కామెడీ సీన్స్ మినహా సినిమాలో పెద్దగా ఎంగేజ్ చేసే కథ లేదు అంటూ ప్రేక్షకులు పెదవి విరిచారు.దీంతో కలెక్షన్స్ జస్ట్ ఓకే అనిపించే విధంగా వచ్చాయి. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 2.60 cr |
సీడెడ్ | 0.60 cr |
ఆంధ్ర(టోటల్) | 0.95 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 4.15 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 3.08 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 7.13 cr |
‘కీడా కోలా’ (Keedaa Cola) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.8.1 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.8.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం కేవలం రూ.7.13 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఫైనల్ గా రూ.1.37 కోట్ల స్వల్ప నష్టాలతో యావరేజ్ టు అబౌవ్ యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది.
‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!
‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!