‘పెళ్ళిచూపులు’ ‘ఈ నగరానికి ఏమైంది?’ వంటి రెండు కల్ట్ మూవీస్ ని అందించిన దర్శకుడు తరుణ్ భాస్కర్.. ఈసారి రూటు మార్చి ‘కీడా కోలా’ అనే క్రైమ్ కామెడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘విజి సైన్మా’ బ్యానర్ పై కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్..లు ఈ చిత్రాన్ని నిర్మించగా… రానా దగ్గుబాటి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. టీజర్, ట్రైలర్స్ ప్రామిసింగ్ గా అనిపించాయి. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.కానీ మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది.
కొన్ని కామెడీ సీన్స్ తప్ప పెద్దగా ఎంగేజ్ చేసే కథ ఇందులో లేదు అని ప్రేక్షకులు కొట్టిపారేశారు.అయితే మొదటి రోజు ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి అని చెప్పాలి. రెండో రోజు కూడా ఈ మూవీ బాగా కలెక్ట్ చేసింది. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 1.84 cr |
సీడెడ్ | 0.31 cr |
ఆంధ్ర(టోటల్) | 0.53 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 2.32 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 2.00 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 4.32 cr |
‘కీడా కోలా’ (Keedaa Cola) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.8.1 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.8.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. 2 రోజుల్లో ఈ చిత్రం రూ.4.32 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే బ్రేక్ ఈవెన్ కి మరో రూ.4.18 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.
మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!