Keeravani: మహేష్‌ సినిమా అప్‌డేట్‌… కీరవాణి ఆన్సర్‌ చూస్తే నవ్వులే!

ఎస్‌.ఎస్‌. రాజమౌళికి ఎం.ఎం.కీరవాణి ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ వస్తోందట. ఇప్పుడు కాదు చాలా రోజులుగా ఇలానే ఉందట. ఏంటీ నమ్మలేకపోతున్నారా? కానీ ఇది నిజం. ఎందుకంటే ఈ మాట చెప్పింది ఎవరో కాదు రాజమౌళి అన్న కీరవాణినే. అయితే ఇదంతా నిజంగా కాదు సుమా. ఆయన ఏదో సరదాకి అన్నమాట. మహేష్‌ బాబు సినిమా అప్‌డేట్‌ గురించి అడిగితే కీరవాణి ఇలా సమాధానమిచ్చారు. దీంతో ఈ ఆన్సర్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

ఓవైపు మహేష్‌ – రాజమౌళి సినిమా స్టార్టింగ్‌ అప్పుడు, కథ ఇదే, హీరోయిన్ ఆమెనే, ఇంకో కథానాయిక కూడా ఉండొచ్చు. మరోక హీరో కూడా సినిమాలో కనిపిస్తాడు. హాలీవుడ్‌ సాంకేతిక నిపుణులు కూడా పని చేస్తారు, అన్ని భాషల్లో తీస్తారు, ఇన్ని భాషల్లో రిలీజ్‌ చేస్తారు అంటూ ఏవేవో వార్తలు సోషల్‌ మీడియాలో, టాలీవుడ్‌ వర్గాల్లో రోజూ ఏదో ఒక పుకారు రూపంలో వినిపిస్తూనే ఉంది. అయితే వీటి విషయంలో క్లారిటీ అయితే లేదు.

నాగార్జున కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘నా సామిరంగా’. విజయ్ బిన్ని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు కీరవాణి సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే మహేష్‌ బాబు సినిమా గురించి అప్‌డేట్‌ అడిగితే… పైన చెప్పిన ‘ఫోన్‌ స్విచ్ఛాఫ్‌’ ఆన్సర్‌ ఇచ్చారు. ఆ సినిమా గురించి అప్‌డేట్‌ కావాలటే రాజమౌళికి ఫోన్‌ చేసి అడగాలి. తనకు ఫోన్‌ చేస్తే అది స్విచ్చాఫ్‌లో ఉంది అని నవ్వేశారు (Keeravani) కీరవాణి.

రాజమౌళి ఇంకా తన వరకు రాలేదని, అందుకే అప్‌డేట్‌ తన దగ్గర లేదు అనేది ఆయన మాటల సారాంశం. కాబట్టి సినిమా ప్రారంభానికి ఇంకాస్త సమయం పడుతుంది అని అంచనా వేయొచ్చు. మిగిలిన సినిమాల అప్‌డేట్స్‌ గురించి మాట్లాడుతూ.. ‘హరి హర వీరమల్లు’ సినిమా విషయానికొస్తే ప్రస్తుతానికి మూడు పాటలు రికార్డు చేశామని చెప్పారు. చిరంజీవి – వశిష్ట సినిమా ఇటీవలే చిత్రీకరణ మొదలైందని, దానికి సంబంధించిన మ్యూజిక్‌ వర్క్‌ జరుగుతోందని చెప్పారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus