Keeravani: ఆయన ఆ మాట అన్నప్పుడు ఆస్కార్‌ విలువ తెలిసింది: కీరవాణి

‘ఆర్‌ఆర్ఆర్‌’ సినిమాలోని ‘నాటు నాటు..’ పాటకు పురస్కారం అందుకున్నప్పుడు తన ఫీలింగ్స్‌ ఏంటి? అనే విషయం ఆయన ఇన్నాళ్లూ ఓపెన్‌గా మాట్లాడలేదు. ఆస్కార్‌ స్టేజీ మీద ఆయనకు ఎక్కువసేపు దొరకలేదు కూడా. అయితే ఆస్కార్‌ తీసుకొచ్చిన ఆనందాన్ని టాలీవుడ్‌ కాస్త ఆలస్యంగానైనా సంబరాలు జరుపుకుంటున్న నేపథ్యంలో కీరవాణి మాట్లాడారు. ఈ క్రమంలో రామోజీరావు గురించి ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. దీంతో ఇప్పుడవి వైరల్‌గా మారాయి. ఎక్కడైనా మూల విగ్రహాలు గుడిలో ఉంటాయి.

వాటి తరఫున ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుల్లో పాల్గొని హారతులు అందుకుంటాయి. అలా ఈ చిత్రానికి ప్రతిష్ఠాత్మకమైన ఈ పురస్కారం రావడం వెనక ప్రధానమైన కృషి చేసిన మూల విగ్రహాల్లాంటి వ్యక్తులు దర్శకుడు రాజమౌళి, నృత్య దర్శకుడు ప్రేమ్‌రక్షిత్‌. మేం ఉత్సవ విగ్రహాల్లా సంబరాల్లో పాల్గొంటున్నాం అని చెప్పారు కీరవాణి. నేను మద్రాస్‌లోని ప్రసాద్‌ 70 ఎం.ఎం థియేటర్లో మొదటి పాట రికార్డ్‌ చేశాను అని తొలి రోజులు గుర్తు చేసుకున్నారు.

దేవాలయం లాంటి థియేటర్లో పాట చేయడం అద్భుతమైన అనుభూతి. దాని ముందు ఆస్కార్‌ పురస్కారం తీపి తిన్నాక మంచి టీ తాగినట్టు అనిపించింది. ఆస్కార్‌ ప్రతిష్ఠాత్మకమైనదని తెలుసు.. అయితే అందుకోవాలనే ఆతృత పెద్దగా కలగలేదు. అయితే ఓసారి రామోజీరావుని కలవడానికి వెళ్లినప్పుడు ‘మీరు ఆస్కార్‌ తీసుకురండి’ అని అన్నారు. ఆస్కార్‌కి ఆయన ఇంత విలువ ఇస్తున్నారంటే, అందులో ఏదో విలువ ఉందన్నమాట అని అనిపించింది.

అంతేకాదు రామోజీరావు కోసమైనా ఆస్కార్ పురస్కారం మాకు రావాలనే ఆత్రుత నాలో (Keeravani) కలిగింది. అప్పటివరకు లేని ఆతృత, కంగారు పురస్కారం ప్రకటించడానికి ఓ నిమిషం ముందు కలిగింది. అందుకే పురస్కారం ప్రకటిస్తున్నప్పుడు బాగా ఉద్వేగానికి లోనయ్యాను అని ఆ రోజు గురించి గుర్తు చేసుకున్నారు కీరవాణి. సమష్టికృషి ఫలితమే ఆస్కార్‌ పురస్కారం అని చెప్పారు. ఇటీవల జరిగిన ఆస్కార్‌ వేడుకల్లో ప్రపంచం మెచ్చిన పాటకు ఆస్కార్‌ దక్కిన విషయం తెలిసిందే.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus