Sri Simha: పెళ్లి పీటలెక్కబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో సింహా కోడూరి..?

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డు గ్రహీత అయిన ఎం.ఎం.కీరవాణి ఇప్పటికీ తమ పాటలతో సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నారు. ఆయనకు ఇద్దరు కొడుకులు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. పెద్ద కొడుకు కాలభైరవ సంగీత దర్శకుడిగా రాణిస్తున్నాడు. ‘కార్తికేయ 2 ‘ వంటి పాన్ ఇండియా సినిమాకి పనిచేశాడు. ఇక రెండో కొడుకు సింహా కోడూరి ‘మత్తు వదలరా’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అంతకు ముందు ఇతను ‘యమదొంగ’ ‘మర్యాదరామన్న’ వంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు అలాగే ‘ఈగ’ సినిమాలో చిన్న క్యామియో రోల్ చేశాడు.

‘మత్తు వదలరా’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ‘తెల్లవారితే గురువారం’ ‘దొంగలున్నారు జాగ్రత్త’ ‘భాగ్ సాలే’ ‘ఉస్తాద్’ వంటి సినిమాల్లో కూడా హీరోగా చేశాడు. ఇదిలా ఉండగా.. త్వరలో ఇతను పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు అని సమాచారం. అవును సీనియర్ నటుడు మురళీమోహన్ మానవరాలితో సింహా కోడూరి (Sri Simha) పెళ్లి ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. మురళీ మోహన్ కొడుకు రామ్ మోహన్ కి కూతురు ఉంది.

ఆమె పేరు రూప మాగంటి. చూడటానికి ఈమె చాలా చక్కగా ఉంటుందట. అంతేకాకుండా ఈమె వందల కోట్ల రూపాయల ఆస్తికి వారసురాలు అని తెలుస్తుంది. ఇక సింహా కోడూరి – రూప.. ల పెళ్లికి సంబంధించిన డిస్కషన్లు పెద్దలు మధ్య జరుగుతున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే వీరి పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని ఇన్సైడ్ టాక్.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus