సెట్ లో మెమొరీ కార్డ్ దొంగిలించిన నటుడు!

‘మత్తువదలరా’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహా. మొదటి సినిమాతోనే నటుడిగా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సతీష్ త్రిపుర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలమవుతుంది. మధ్యలో కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి షూటింగ్ పునః ప్రారంభించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం ఓ వీడియోను షేర్ చేసింది. తన స్నేహితుడి పెళ్లి కారణంగా ఒకరు సెలవుకి పర్మిషన్ ఇవ్వాలని శ్రీసింహా తన దర్శకుడిని కోరగా..

కుదరదని ఎందుకంటే ఆల్ ఆర్టిస్ట్స్ కాంబినేషన్ సీన్లు ఉన్నాయని సమాధానమిస్తారు. ఆ మాటకు శ్రీసింహా ‘ఒక్క రెండు గంటలైన ఇవ్వండి.. అలా వెళ్లి.. వాళ్లకి కనిపించి వచ్చేస్తా’ అని అడగ్గా.. ‘ఒక పని చేయండి.. కావాలంటే జూమ్‌ కాల్‌లో విషెస్‌ చేయండి.. కనిపించినట్లు ఉంటుంది.. పెళ్లి చూసినట్లు ఉంటుంది’ అని చెబుతాడు. దాంతో చేసేది ఏమీలేక షూటింగ్ లో జాయిన్ అవుతాడు శ్రీసింహ. ఇంతలో మెమొరీ కార్డు కనిపించడం లేదంటూ టీమ్ వెతుకుతూ ఉంటుంది.

ఈ క్రమంలోనే కొన్ని గంటలపాటు చిత్రీకరణ వాయిదా వేస్తున్నామని దర్శకుడు చెప్పడంతో.. ‘సరే సర్.. నేను నా పనులు చూసుకువస్తా.. అయినా డైరెక్టర్‌ గారూ.. దొంగలున్నారు జాగ్రత్త’ అంటూ సెట్ లో మెమొరీ కార్డ్ తనే దొంగతనం చేసినట్లు మనకి చూపిస్తారు. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!


టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus