Keerthy Stylish: కీర్తి సురేష్ ధరించిన స్టైలిష్ బ్లాక్ జంప్ సూట్ రేటు ఎంతంటే..?

కీర్తి సురేష్.. రామ్ పోతినేని ‘నేను.. శైలజ’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. ‘మహానటి’ తో నేషనల్ అవార్డ్ అందుకుని.. మోస్ట్ వాంటెడ్ అండ్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారిపోయింది.. ఆ తర్వాత క్రేజ్ వల్ల వరుసగా ఆఫర్స్ అయితే క్యూ కట్టాయి కానీ.. హిట్ అయితే పడలేదు.. దాదాపు అరడజను పైగానే ఫ్లాప్స్ కొట్టింది.. ఇక రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ల మాదిరిగానే అందాలు ఆరబోస్తూ.. హీరో చుట్టూ తిరుగుతుండే క్యారెక్టర్లు చేస్తోంది..

‘సర్కారు వారి పాట’ లో కాస్త బోల్డ్ సీన్స్, గ్లామర్ డోస్ లాంటివి పెంచేసింది కూడా.. వీలు కుదిరినప్పుడల్లా హాట్ హాట్ లుక్స్‌తో.. డిఫరెంట్ అండ్ స్టైలిష్ కాస్ట్యూమ్స్‌లో ఫోటోషూట్స్ చేసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. యూత్ పోరగాళ్లకి ఫుల్ కిక్ ఇస్తోంది.. కీర్తిలోని గ్లామర్ యాంగిల్ చూసి షాక్ అవుతున్నారు మగజాతి ఆణిముత్యాలు.. ఈ కేరళ కుట్టి త్వరలోనే అందరికీ గుడ్ న్యూస్ చెప్పబోతుందనే వార్త మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది..

కీర్తి సురేష్ త్వరలో పెళ్లి చేసుకోబోతుందట.. తన మ్యారేజ్ గురించి ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి కానీ ఈసారి ఫిక్స్ అంటున్నారు.. ప్రస్తుతం కీర్తి చేతిలో ఆరు సినిమాలున్నాయి.. చిరంజీవి చెల్లెలిగా నటిస్తున్న ‘భోళా శంకర్’ షూటింగ్ త్వరగా కంప్లీట్ చేయాలని యూనిట్‌ని కోరిందట.. మిగతా ప్రాజెక్టుల దర్శక నిర్మాతలను కూడా వీలైనంత త్వరగా తన పార్ట్ షూట్ పూర్తి చేయాలని రిక్వెస్ట్ చేస్తోందట.. అలాగే కొత్త సినిమాలేవీ కూడా కమిట్ కావడం లేదు..

ఇదిలా ఉంటే.. కీర్తి లేటెస్ట్ ఫోటోషూట్‌ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. స్టైలిష్ కాస్ట్యూమ్స్‌లో గ్లామర్‌గా కనిపిస్తూ ఆకట్టకుంటుంది.. తన కాస్ట్యూమ్ విషయానికొస్తే.. VARUN BAHA – Tulle Black Embroidered Strapless Jumpsuit – కాస్ట్ : రూ. 1,95,000/-.. ఈ డిఫరెంట్ డ్రెస్‌లో మోడ్రన్, సింపుల్‌గా‌ కీర్తి లుక్ బాగుంది..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus