Keerthy Suresh: ‘భోళా’ సెట్‌లో చిరంజీవి – కీర్తి మధ్య ఏం జరిగిందంటే?

Advertisement

తల్లి, కూతురు ఇద్దరితోనూ నటించే హీరోలు చాలా తక్కువమందే ఉంటారు. అలాగే అలా పరిశ్రమలో వచ్చేవాళ్లూ తక్కువగానే ఉంటారు. ఈ రెండూ జరిగిన సినిమా ‘భోళా శంకర్‌’. ఈ సినిమాలో చిరంజీవికి చెల్లిగా నటించిన కీర్తి సురేశ్‌ మాతృమూర్తి మేనకతో కూడా చిరు నటించిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించే ఇప్పుడు చర్చ నడుస్తోంది. అయితే ఈ క్రమంలో మరికొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. సెట్స్‌లో కీర్తి సురేశ్‌ – చిరంజీవి ఎలా ఉండేవారు, ఇద్దరి మధ్య ఎలాంటి అనుబంధం ఉంది లాంటి విషయాలు ఆసక్తికరంగా నిలిచాయి.

‘పున్నమి నాగు’ సినిమా టైమ్‌లో అందులో నటించిన మేనకకు అప్పట్లో పెద్ద అనుభవం లేదు. అప్పుడే ఇండస్ట్రీలోకి రావడంతో షూటింగ్‌ సమయంలో చిరంజీవి ఆమెకు ఎన్నో విషయాల్ని చెప్పేవారట. చిన్న పాపకు చెప్పినట్టు సినిమా, సినిమా పరిశ్రమకు సంబంధించిన విషయాలు వివరించేవారంట. ఇప్పుడు ‘భోళా శంకర్‌’ విషయంలోనూ ఇంచుమించు అలానే జరిగిందట. ‘భోళాశంకర్’ సినిమాలో ఛాన్స్‌ రాగానే.. కీర్తి తన తల్లి దగ్గరకు వెళ్లి చిరంజీవి గురించి చాలా విషయాలు అడిగి తెలుసుకుందట.

అంతేకాదు ‘భోళా శంకర్‌’ సెట్స్‌లో చిరంజీవి ‘నువ్వు మేనక అంత అమాయకురాలివి కావు’ అని కీర్తిని చిరంజీవి ఆటపట్టించేవారట. అలాగే షూటింగ్‌ జరిగినన్ని రోజులూ చిరంజీవి ఇంటి నుండే భోజనం వచ్చేదంట. చిరంజీవి ఇంట్లో చేసే ఉలవచారు, కాకరకాయ కూర లాంటివి ఇష్టమని కీర్తి చెప్పింది. కొన్నిసార్లు అయితే… ఏం కావాలో చెప్పి మరీ చిరంజీవి ఇంటి నుండి తెప్పించుకునేదంట. అంతలా సినిమా షూటింగ్‌ సమయంలో సరదాగా సాగింది అని కీర్తి చెప్పింది.

ఇక ఈ సినిమాను ఆగస్టు 11న విడుదల చేస్తున్నారు. తమిళంలో మంచి విజయం అందుకున్న ‘వేదాళం’ సినిమాకు ఇది రీమేక్‌ అనే విషయం తెలిసిందే. అందులో లక్ష్మీ మీనన్‌ చేసిన పాత్రలో ఇక్కడ కీర్తి సురేశ్‌ (Keerthy Suresh) నటించింది. అక్కడ శ్రుతి హాసన్‌ పాత్రను తెలుగులో తమన్నా చేసింది.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus