సావిత్రి పాత్రకు కీర్తి సురేష్ ను అనుకోలేదట..!

‘మహానటి’ సావిత్రి గారి జీవితాన్ని ఓ దృశ్య కావ్యంగా మనకు అందించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. సావిత్రి గారి జీవితం తెర పై ఆవిష్కరించాలి అంటే అంత ఈజీ కాదు. ఆమె పాత్రలో నటించే నటి… ఎంతో పరిణితి చెంది ఉండాలి. మిగిలిన పాత్రలు ఎలా ఉన్నా.. సావిత్రి పాత్రకు సూట్ అయ్యే నటిని ఎంచుకోవడం చాలా కష్టమయ్యింది అని నిర్మాత స్వప్న దత్ తాజాగా చెప్పుకొచ్చారు. ‘సావిత్రి గారి పాత్ర కోసం ముందుగా ఎంతో మంది హీరోయిన్లను పరిశీలించాం.

స్క్రీన్ టెస్ట్ చేసి ఆ ఫోటోలను మా టీం గ్రూప్ లో షేర్ చేసి వారి అభిప్రాయాలు తీసుకునే వాళ్ళం. కానీ ఓ రోజు నాగ్ అశ్విన్… కీర్తి సురేష్ పేరు చెప్పాడు. ఆయన ఆ పేరు చెప్పగానే నేను షాక్ అయ్యాను.అసలు ఆమె మా లిస్ట్ లోనే లేదు. కానీ తరువాత ఆమెతోనే ఈ పాత్ర చేయించి విజయం సాధించాం’ అంటూ స్వప్న దత్ చెప్పుకొచ్చింది. నిజంగానే సావిత్రి గారి పాత్రకు కీర్తి సురేష్ వందకు వంద శాతం న్యాయం చేసింది. ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు దక్కించుకుని స్టార్ హీరోయిన్ అయిపోయింది.

ఈ చిత్రం టీం సభ్యులు అయిన నాగ్ అశ్విన్, స్వప్న దత్, దుల్కర్ సల్మాన్, కీర్తి సురేష్, కెమెరామెన్ డేని .. వంటి వారు వీడియో కాల్ ఇంటర్వ్యూలో పాల్గొని చెప్పిన సంగతులు ఇవి. నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘సావిత్రి గారి జీవితం గురించి అందరికీ తెలియాలి అని ఆశపడ్డాను. కానీ అంతకు మించిన ఫలితాన్నే అందుకున్నాము. అందరూ ఆమె జీవితం గురించి తెలుసుకున్నారు’ అంటూ చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus