Keerthy Suresh: చేతిలో అరడజను సినిమాలున్న కీర్తి సురేష్ మేకర్స్‌ని ఏమని రిక్వెస్ట్ చేస్తుందంటే..?

కీర్తి సురేష్ త్వరలోనే అందరికీ గుడ్ న్యూస్ చెప్పబోతుందనే వార్త మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.. దీని గురించి తను రెెస్పాండ్ అవడం లేదు కాబట్టి నిజమేననే ప్రచారమూ జరుగుతోంది.. రామ్ పోతినేని ‘నేను శైలజ’ తో తక్కువ టైంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.. మదర్ టంగ్ మలయాళం, తెలుగుతో పాటు తమిళంలోనూ స్టార్ హీరోలతో ఆడిపాడింది.. ‘మహానటి’ తో కీర్తి తన కెరీర్‌ని స్ట్రాంగ్‌గా బిల్డ్ చేసుకుంది.. ఏకంగా నేషనల్ అవార్డ్ అందుకుంది..

దీంతో వరుసగా ఆఫర్స్ క్యూ కట్టాయి.. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.. తన కోసమే కథలు రాసేవారు.. తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ కూడా క్రియేట్ అయింది.. కట్ చేస్తే ఆమె చేసిన మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలు అనుకున్నంతగా ఆడలేదు.. దీంతో హీరోయిన్‌గా కాస్త రూట్ మార్చి, అందాల విందు చేస్తూ అలరించింది.. నాని పక్కన నటించిన పాన్ ఇండియా ఫిలిం ‘దసరా’ మార్చి 30న రిలీజ్ కానుంది..

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. కీర్తి సురేష్ త్వరలో పెళ్లి చేసుకోబోతుందట.. తన మ్యారేజ్ గురించి ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి కానీ ఈసారి ఫిక్స్ అంటున్నారు.. ప్రస్తుతం కీర్తి చేతిలో ఆరు సినిమాలున్నాయి.. చిరంజీవి చెల్లెలిగా నటిస్తున్న ‘భోళా శంకర్’ షూటింగ్ త్వరగా కంప్లీట్ చేయాలని యూనిట్‌ని కోరిందట.. మిగతా ప్రాజెక్టుల దర్శక నిర్మాతలను కూడా వీలైనంత త్వరగా తన పార్ట్ షూట్ పూర్తి చేయాలని రిక్వెస్ట్ చేస్తోందట.. అలాగే కొత్త సినిమాలేవీ కూడా కమిట్ కావడం లేదు..

దీనికి కారణం కీర్తి పెళ్లి పీటలు ఎక్కబోతుండడమేనని సమాచారం.. తన చిన్ననాటి స్నేహితుడిని మ్యారేజ్ చేసుకోబోతోందట కీర్తి.. ప్రస్తుతం 30 సంవత్సరాలు కాబట్టి.. పెళ్లి చేసుకుని, ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేయడానికి ఇదే సరైన సమయం అని కీర్తి సురేష్ ప్లాన్ చేసుకుంటుందని అంటున్నారు.. త్వరలోనే ఆమె ఈ శుభవార్తను అధికారికంగా ప్రకటించనుందని తెలుస్తుంది.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus