సావిత్రిలా మళ్ళీ నేను నటించలేదు అందుకే ఆ సినిమా వదిలేశా
- October 17, 2018 / 01:13 PM ISTByFilmy Focus
‘నేను శైలజ’ ‘నేను లోకల్’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించిన కీర్తి సురేష్ ‘మహానటి’ చిత్రంతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళంలో స్టార్ హీరోల సరసన నటిస్తూ బిజీ అయిపోయింది. తాజాగా విశాల్ సరసన నటిస్తున్న ‘పందెం కోడి2’ అక్టోబర్ 18 న విడుదల కానుంది. మొన్నటి వరకూ ‘ఎన్టీఆర్’ బయోపిక్ లో కీర్తి సురేష్ మరోసారి ‘సావిత్రి’ పాత్రలో కనిపిస్తుందంటూ వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయం పై కీర్తి క్లారిటీ ఇచ్చింది.
‘పందెం కోడి2’ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె మాట్లాడుతూ.. “నా కెరీర్లో ‘మహానటి’ సినిమా ఒక వరం. అది ఓ మ్యాజిక్, మళ్ళీ నేను సావిత్రి పాత్రలో కనిపిస్తే అలా నటించగలనో లేదో నాకే తెలీదు. అందుకే ‘ఎన్టీఆర్’ లో మళ్ళీ ఆ పాత్రలో కనిపించడానికి ఒప్పుకోలేదు.’ అంటూ బదులిచ్చింది.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus













