Keerthy Suresh: బాలీవుడ్ ఎంట్రీ పై వీడియోతో క్లారిటీ ఇచ్చిన కీర్తి!

సౌత్ లో సక్సెస్ అయిన హీరోయిన్లు… బాలీవుడ్ వైపు దృష్టి పెట్టడం అనేది కొత్త విషయం కాదు. మహానటి సావిత్రి నుండీ జయసుధ, జయప్రద, శ్రీదేవి వంటి వారు బాలీవుడ్ లో అడుగుపెట్టి సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. అటు తర్వాత కూడా సౌందర్య… ఇలియానా, పూజా హెగ్డే , సమంత వంటి భామలు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. సాయి పల్లవి కూడా బాలీవుడ్ ప్రాజెక్టు ఓకే చేసింది. ఇప్పుడు కీర్తి సురేష్ వంతు వచ్చింది.

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈమె మలయాళం సినిమాల్లో కూడా నటించింది. ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ కి రెడీ అవుతోంది. కీర్తి సురేష్.. బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది అని ఒక వీడియోతో స్పష్టం చేసింది. ఆ వీడియోని కనుక గమనిస్తే…. కీర్తి సురేష్ ఆటోలో ప్రయాణిస్తోంది. ఆమె పక్కన ఒక బాలీవుడ్ హీరో ఉన్నాడు. అతను మరెవరో కాదు వరుణ్ ధావన్. వరుణ్ సరసనే కీర్తి సురేష్ నటిస్తోందని ఈ వీడియో చూస్తే ఎవరైనా డౌట్ పడతారు.

ఈ మూవీకి తమిళ దర్శకుడు కాలీస్ దర్శకత్వం వహించనున్నాడు అని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది అని సమాచారం. వచ్చే ఏడాది మే లో ఈ మూవీ రిలీజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని టాక్. మరి కీర్తి (Keerthy Suresh) బాలీవుడ్ ఎంట్రీ ఎలాంటి ఫలితాన్ని అందిస్తుంది అనేది చూడాలి.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus