Keerthy Suresh: షాపింగ్ మాల్ ఓపెనింగ్లో సందడి చేసిన కీర్తి సురేష్.. వైరల్ అవుతున్న వీడియో!

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘నేను శైలజ’ ‘నేను లోకల్’ వంటి సూపర్ హిట్లతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత ‘మహానటి’ తో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఆ సినిమా వల్ల తెలుగుతో పాటు తమిళ భాషల్లో కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కేవలం గ్లామర్ రోల్స్ కు మాత్రమే పరిమితం కాకుండా ‘పెద్దన్న’ ‘భోళా శంకర్’ లో చెల్లెలి పాత్ర చేసింది.

అలాగే ‘సర్కారు వారి పాట’ లో నెగిటివ్ రోల్ చేసింది. మరోపక్క విమెన్ సెంట్రిక్ సినిమాల్లో కూడా నటించింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి సురేష్ ఇంకో వైపు సోషల్ మీడియాలో కూడా గ్లామర్ ఫోటోలు కూడా షేర్ చేస్తూ బిజీగా గడుపుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా.. తాజాగా కీర్తి సురేష్ బాలాపూర్ లోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వచ్చి సందడి చేసింది. రాష్ట్ర విద్యాశాఖామంత్రి అయిన శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారితో కలిసి ఆమె ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసింది.

కీర్తి సురేష్ ను చూడటానికి వందల సంఖ్యలో అభిమానులు సందడి చేశారు. వారిని కంట్రోల్ చేయడానికి పోలీసులకి కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో ఆమె కొంతమందికి సెల్ఫీలు ఇవ్వడం కూడా చేసింది. ఇదిలా ఉండగా.. ఈ షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో కీర్తి సురేష్ పాల్గొన్న ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus