Keerthy Suresh Remuneration: రెమ్యునరేషన్ విషయంలో కీర్తి అలా వ్యవహరిస్తారా?

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన కీర్తి సురేష్ కు ఈ ఏడాది సర్కారు వారి పాట సినిమాతో కమర్షియల్ సక్సెస్ దక్కింది. సాని కాగితం అనే మూవీలో కీర్తి సురేష్ డీగ్లామర్ రోల్ లో నటించి మెప్పించారు. ఈ సినిమాలో నటించిన అనుభవం గురించి కీర్తి సురేష్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సెల్వ రాఘవన్ డైరెక్టర్ అయినా నటుడిగానే చూశానని ఆమె అన్నారు. సెల్వ రాఘవన్ కూడా డైరెక్టర్ చెప్పిన విధంగా నటించాడని కీర్తి సురేష్ వెల్లడించారు.

మహానటి సినిమా తర్వాత 7 నెలలు ఇంట్లోనే ఉన్నానని కీర్తి సురేష్ తెలిపారు. ఆ సమయంలో ఆహారం విషయంలో నియమాలు పాటించడంతో బరువు తగ్గానని కీర్తి సురేష్ చెప్పుకొచ్చారు. సాని కాగితం మూవీ ట్రైలర్ చూసి ధనుష్ ఫోన్ చేశారని కీర్తి సురేష్ తెలిపారు. ఆ సమయంలో సెల్వ రాఘవన్ సూపర్ గా నటిస్తున్నాడని ఆయన నటనను చూస్తే నాకే దడ పుడుతోందని చెప్పానని కీర్తి సురేష్ తెలిపారు. తమిళం, తెలుగు అని వేరు చేసి చూడటం లేదని కీర్తి సురేష్ తెలిపారు.

సాని కాగితం ఓటీటీలో రిలీజ్ కావడంతో ప్రపంచ స్థాయిలో ఈ సినిమాను చూసి ఆనందించారని ఈ సినిమా థియేటర్లలో విడుదలై ఉంటే బాగుండేదని ఆమె చెప్పుకొచ్చారు. తెలుగు, తమిళ, మలయాళ భాషా సినిమాలలో నేను నటించానని ఆమె పేర్కొన్నారు. విజయ్ సేతుపతి నటన అంటే చాలా ఇష్టమని కీర్తి సురేష్ కామెంట్లు చేశారు. కార్తీ, జయంరవి మరి కొందరు నటులతో నటించాలని ఉందని ఆమె చెప్పుకొచ్చారు. రాజమౌళి, శంకర్, మణిరత్నం డైరెక్షన్ లో నటించాలని ఉందని ఆమె కామెంట్లు చేశారు.

ఈ దర్శకులు కీర్తి సురేష్ కు ఛాన్స్ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది. సినిమాసినిమాకు కీర్తి సురేష్ కు క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం. కీర్తి సురేష్ తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలను అందుకుంటారో లేదో చూడాల్సి ఉంది. నేను రెమ్యునరేషన్ ను పెంచలేదని రెమ్యునరేషన్ ను తగ్గించుకున్న సందర్భాలు సైతం నా జీవితంలో ఉన్నాయని ఆమె వెల్లడించారు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus