బరువు తగ్గి కీర్తి సురేష్ తప్పు చేసిందా..?

ఈ మధ్య కాలంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించి విడుదలైన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ రిజల్ట్ ను అందుకుంటున్న సంగతి తెలిసిందే. మహానటి సినిమా తరువాత లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో ఎక్కువగా నటించిన కీర్తి సురేష్ కు మహానటి స్థాయిలో ఏ సినిమా గుర్తింపును తెచ్చిపెట్టలేదు. అరుంధతి సినిమా తరువాత అనుష్క లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో ఎక్కువగా నటించగా కీర్తి సురేష్ కూడా అనుష్కనే ఫాలో అయ్యారు.

అనుష్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో విజయాలను సొంతం చేసుకోగా కీర్తి సురేష్ కు మాత్రం వరుస ఫ్లాపులు ఎదురవుతున్నాయి. మహానటికి ముందు కీర్తి సురేష్ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు హిట్లు కాగా కీర్తి సురేష్ విషయంలో మాత్రం భిన్నంగా జరుగుతోంది. ఒక రకంగా కీర్తి సురేష్ కష్టాలకు అనుష్కనే కారణమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహానటి సినిమా తరువాత కీర్తి సురేష్ పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి సినిమాల్లో నటించింది.

ఈ సినిమాలో పెంగ్విన్, మిస్ ఇండియా ఇప్పటికే విడుదలై డిజాస్టర్లు అయ్యాయి. గుడ్ లక్ సఖి సినిమాపై కూడా ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేవు. కీర్తి సురేష్ భవిష్యత్తు రంగ్ దే, సర్కారు వారి పాట సినిమాలపై ఆధారపడి ఉందని చెప్పవచ్చు. ఈ రెండు సినిమాలు హిట్టైతే మాత్రమే కీర్తి సురేష్ కు కొత్త సినిమా ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు కీర్తి సురేష్ లుక్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదు.

Keerthy Suresh facing problems due to Anushka1

గతంలో బొద్దుగా ఉన్న కీర్తి సురేష్ ఈ మధ్య కాలంలో సన్నగా మారారు. కీర్తి సురేష్ కొత్త లుక్ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోవడం లేదు. కీర్తి సురేష్ లుక్ కూడా ఆమె కెరీర్ పై ప్రభావం చూపుతోంది. ఈ నెల 26న విడుదల కాబోతున్న రంగ్ దే కీర్తి సురేష్ కు సక్సెస్ ను తెచ్చిపెడుతుందో లేదో చూడాల్సి ఉంది.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus