నేను శైలజ మూవీతో కీర్తి సురేష్ తెలుగు ప్రజలకు పరిచయమయింది. నేను లోకల్ తో వరుసగా రెండు విజయాలను సొంతం చేసుకుంది. అజ్ఞాతవాసిలోను ఆకట్టుకుంది. సినీ నేపథ్యం నుంచి వచ్చిన ఈ బ్యూటీ తమిళంలోనూ రెమో వంటి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. తెలుగులో, తమిళంలో అభిమానులను ఎక్కువమంది సంపాదించుకున్న కీర్తి సురేష్ ని మహానటి సినిమా మరింత గొప్ప స్థానంలో నిలబెట్టింది. దీంతో ఆమెకు ఎన్నో అవకాశాలు వచ్చి పడ్డాయి. ఎన్టీఆర్ బయోపిక్, జయలలిత బయోపిక్ లో నటించమని కోరారు. ఆమె మాత్రం సున్నితంగా నో చెప్పి.. విక్రమ్ తో సామి 2 (లక్ష్మీనరసింహ స్వామి సీక్వెల్), విశాల్ తో సండా కోజి 2 (పందెం కోడి సీక్వెల్), విజయ్ తో సర్కార్ సినిమాలకు ఓకే చెప్పింది. ఇక్కడ కథ అడ్డం తిరిగింది.
ఇందులో సామి 2 ఫెయిల్ అయింది. ఇక పందెం కోడి 2 మంచి కలక్షన్స్ రాబట్టినప్పటికీ కీర్తి సురేష్ కి పేరు తీసుకురాలేకపోయింది. పల్లెటూరు అల్లరి అమ్మాయిగా కీర్తి నటన ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఆమె కెరీర్ ఇబ్బందుల్లో పడింది. ఇప్పుడు ఆమె ఆశలన్నీ సర్కార్ మీదే పెట్టుకుంది. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ కి జోడీగా నటించింది. విజయ్, మురుగదాస్ కాంబినేషన్ లో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అలాగే ఇది కూడా హిట్ అయి తనని హిట్ ట్రాక్ లోకి తీసుకెళుతుందని కీర్తీ సురేష్ ఆశిస్తోంది.