నేను శైలజ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్, తొలి చిత్రంతోనే మంచి కొట్టింది. ఆ తర్వాత నానితో నటించిన నేను లోకల్ కూడా హిట్ అవడంతో తెలుగులో కీర్తికి వరుస ఆఫర్స్ వచ్చాయి. ఆ తర్వాత పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ఆజ్ఞాతవాసి చిత్రంలో కీర్తికి ఆఫర్ రావడంతో, ఈ భామకు ఎదురుండదని అనున్నారు. అయితే ఆ సినిమా రిజల్ట్ కీర్తికి పెద్ద షాకే ఇచ్చింది. క్రేజీ కాంబినేషన్ ఘోరంగా ప్లాప్ అవడంతో ఆ ప్రభావం కీర్తి పై కూడా పడింది. అయితే మహానటి చిత్రంతో ఏకంగా జాతీయ పురస్కార్ సొంతం చేసుకున్న కీర్తి, టాప్ రేస్ చెయిర్‌లో దూసుకుపోయింది.
మహానటి రిజల్ట్ కీర్తి సురేష్ కెరీర్‌నే మార్చేసింది. మహానటి ఫేమ్‌తో వరుసగా క్రేజీ మూవీస్‌తో కీర్తి ఫుల్ బిజీ హీరియిన్‌గా మారిపోయింది. మహానటి లాంటి అద్భుతమైన మూవీ తర్వాత, కీర్తి పై అంచనాలు ఓ రేంజ్‌లో పెరిగాయి. అయితే ఆ తర్వాత కీర్తి నటించిన చిత్రాలన్నీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాయి. మహానటి తర్వాత కథల ఎంపికలో కన్ఫ్యూజ్ అయిన కీర్తి, వరుసగా స్వామీ స్కేవ్, పందెంకోడి2, సర్కార్ లాంటి కమర్షియల్ చిత్రాల్లో నటించింది. ఆ చిత్రాల్లో కీర్తి పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేకపోవడం, ఆ చిత్రాల రిజల్ట్స్ కూడా కీర్తి కెరీర్ పై దెబ్బేశాయి. దీంతో రూట్ మార్చిన కీర్తి లేడీ ఓరియెంటెండ్ చిత్రాల బాట పట్టినా, ఆ సినిమాల రిజల్ట్స్ మాత్రం కీర్తికి నిరాశనే మిగిల్చాయి. భారీ హైప్‌తో ఓటీటీలో విడుదల అయిన థ్రిల్లర్ మూవీ పెంగ్విన్ డిజాస్టర్ అయ్యింది.
ఇక తాజాగా ఓటీటీ ద్వారా విడుదల అయిన మరో లేడీ ఓరియంటెడ్ మూవీ మిస్ ఇండియా మూవీ చూసిన వారు అయితే, కీర్తి ఛాయిస్ పై పెదవి విరుస్తున్నారు. తన ఇమేజ్‌కు సరిపోయే కథలు ఎంచుకోవడంతో, ఈ జాతీయ ఉత్తమ నటి పూర్తిగా ఫెయిల్ అవుతోందని సినీ ప్రియులు భావిస్తున్నారు. ప్రస్తుతం లేడీ ఓరియంటడ్ మూవీస్‌కు కీర్తి బెస్ట్ ఛాయిస్ అయినా, ఆమె ఇలాంటి ప్రాజెక్ట్స్ టేకప్ చేసుకునే టప్పుడు ఆలోచించుకోవాలని ఆమె ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. తన ఇమేజ్‌కు సరిపోని కథలు ఎంచుకుంటూ ఇలానే సాగితే, ఈ మహానటి కొంపమునుగడం ఖాయమని, మహానటితో వచ్చిన ఫేం మొత్తం పోగొట్టుకుంటూ.. కీర్తి కిరీటానికి దూరమవడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.