Keerthy Suresh: కోవిడ్ బారిన పడ్డ స్టార్ హీరోయిన్!

దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఏ రేంజ్ లో ప్రభావం చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజుకి లక్షల కేసులు నమోదవుతున్నాయి. సినీ ప్రమఖులు చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మహానటి కీర్తి సురేష్ కి కోవిడ్ సోకింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ”నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. స్వల్ప లక్షణాలే ఉన్నాయి. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. కానీ కరోనా విజృంభిస్తున్న తీరును చూస్తే భయంగా ఉంది.

దయచేసి అందరూ కరోనా నియమాలను పాటించండి. నేను ప్రస్తుతం ఐసొలేషన్ క్షేమంగా ఉన్నాను. గత కొన్ని రోజులుగా నాతో ఉన్నవారు దయచేసి పరీక్షలు చేయించుకోండి” అని చెప్పింది. అలానే ఇంకా మీరు వ్యాక్సిన్ వేయించుకోకపోతే దయచేసి త్వరగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించింది. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల పరిస్థితిని అదుపు చేయవచ్చని.. మన కోసం మనల్ని ప్రేమించే వారికి కోసం ఆ పని చేయాల్సిందేనని చెప్పింది. త్వరగానే కోలుకుని తిరిగి వస్తానని నమ్ముతున్నానని.. మళ్లీ యాక్షన్‌లో దిగుతానంటూ చెప్పుకొచ్చింది.

ఇప్పటికే టాలీవుడ్ లో చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. మహేష్ బాబు, తమన్, త్రిష, మంచు లక్ష్మీ, రాజేంద్ర ప్రసాద్ వంటి వారు ఐసొలేషన్ లో ఉన్నారు. ఈరోజు రేణుదేశాయ్ కూడా తనకు తన కొడుకు అకీరాకు కరోనా పాజిటివ్ అని వెల్లడించింది. అందరూ కరోనా నిబంధనలను పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలంటూ సెలబ్రిటీలు కోరుతున్నారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus