తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో తనదైన నటనతో గుర్తింపు పొందిన కీర్తి సురేష్ (Keerthy Suresh) ఇప్పుడు కాస్త వెనుకబడిన నటి అయ్యిందనే మాటలు వినిపిస్తున్నాయి. ‘మహానటి’ (Mahanati) లాంటి నటన పరంగా బలమైన సినిమా తర్వాత సక్సెస్‌ఫుల్ కమర్షియల్ ప్రాజెక్ట్ కొరవడటం ఆమెకు పెద్ద మైనస్ అయింది. అయితే ఇటీవల గ్లామర్ లుక్‌తో కీర్తి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండటంతో, మళ్లీ బజ్‌కి లోటులేదనిపిస్తోంది. ఇటీవల కీర్తి పలు క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తోందనే గాసిప్స్ వైరల్ అవుతున్నాయి.
వాటిలో మొదటగా రణబీర్ కపూర్‌తో (Ranbir Kapoor) ఓ ఎమోషనల్ లవ్ స్టోరిలో కీర్తి నటించబోతోందన్న వార్త హాట్ టాపిక్ అయింది. ఇది అఫీషియల్ కాకపోయినా, బాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోందట. రణబీర్ నెవ్వర్ బిఫోర్ జోనర్‌లో ఉండే ఈ లవ్ స్టోరీలో కీర్తి ఉంటే, ఆమెకు హిందీలో రెండో బ్రేక్ దక్కే అవకాశం ఉంది. మరోవైపు టాలీవుడ్‌లో నితిన్ (Nithin Kumar), వేణు యెల్దండీ (Venu Yeldandi) కాంబోలో రాబోతున్న లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘ఎల్లమ్మ’కు కీర్తి టైటిల్ రోల్ చేయనుందని టాక్.
ఇది అధికారికంగా ప్రకటించలేదు కానీ, ఇండస్ట్రీలో మాత్రం గట్టిగా చర్చ జరుగుతోంది. అదే సమయంలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) – రవికిరణ్ కోల (Ravi Kiran Kola) దర్శకత్వంలో రూపొందే రౌడీ జనార్దన్ మూవీకి కూడా కీర్తినే ఫైనల్ చేశారనే ప్రచారం ఉంది. అవీ కాకుండా ‘ఉప్పు కప్పురంబు’, ‘రివాల్వర్ రీటా’ లాంటి సినిమాలు తక్కువ బజ్‌తో నిర్మాణంలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు ఎప్పుడైతే విడుదల అవుతాయో, అప్పటివరకు కీర్తి కెరీర్ ఓ క్లారిటీ రాకుండా ఉంటుందనే చెప్పాలి.
ప్రస్తుతం ఉన్న రూమర్స్‌లో ఒక్కదైనా కన్ఫర్మ్ అయితే, కీర్తి సురేష్‌కు మళ్లీ గేమ్ ఛేంజర్ రాబోతుందన్న మాట మాత్రం నిజమే. ఇక ఫ్యాన్స్ మాత్రం ఆశతో ఎదురు చూస్తున్నారు. ‘మహానటి’ ఫేమ్‌తో వచ్చిన ఆ స్టార్ ఇమేజ్‌కి సరిపోయేలా ఓ స్ట్రాంగ్ ప్రాజెక్ట్ ఎప్పుడొస్తుందా అనే కుతూహలం కొనసాగుతూనే ఉంది. బిజీగా కనిపించినా, బ్రేక్ ఇస్తే మాత్రం ఈ మధ్యకాలం వదిలేసిన స్టార్ స్టేటస్ మళ్లీ ఆమె చేతుల్లోకి రావడం ఖాయం.