Keerthy Suresh: మణిరత్నం సినిమాను లైట్ తీసుకున్న కీర్తి!

దర్శకుడు మణిరత్నంకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాల్లో నటించే ఛాన్స్ కోసం స్టార్స్ ఎదురుచూస్తుంటారు. చిన్న రోల్ చేయడానికైనా ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటిది ఈ డైరెక్టర్ సినిమా ఛాన్స్ ను ఓ స్టార్ హీరోయిన్ వదులుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె మరెవరో కాదు.. కీర్తి సురేష్. మణిరత్నం లేటెస్ట్ సినిమా ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రబృందం నుంచి కీర్తికి పిలుపు రాగా.. డేట్స్ లేవని ఆ సినిమా వదులుకుందట.

రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఇప్పుడు కీర్తి సినిమా వదులుకున్న విషయం వైరల్ అవుతోంది. చాలా మంది ఆమెని విమర్శిస్తున్నారు. మణిరత్నం లాంటి డైరెక్టర్ ఆఫర్ ఇస్తే వదులుకొని చాలా తెలివితక్కువగా వ్యవహరించిందంటూ నెటిజన్లు ఆమెని ట్రోల్ చేస్తున్నారు. ‘మహానటి’ సినిమా తరువాత కీర్తికి పలు సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. కానీ ఆ సినిమాలేవీ వర్కవుట్ కాలేదు. అలాంటి సమయంలో మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’లో నటించే ఛాన్స్ వచ్చింది.

అయితే అదే సమయంలో రజినీకాంత్ కు చెల్లెలిగా ‘అన్నాత్తే’ సినిమాలో ఛాన్స్ రావడం, మరోపక్క ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ లో పాల్గొనాల్సి ఉండడంతో మణిరత్నం ఆఫర్ రిజెక్ట్ చేసింది. రజినీకాంత్ తో కలిసి నటించాలనే ఉద్దేశంతో కీర్తి డేట్స్ సెట్ కావడం లేదని మణిరత్నంకి చెప్పినట్లై టాక్. దీంతో కీర్తి స్థానంలో త్రిషను తీసుకున్నారు. ఇందులో త్రిష కుందనవై అనే రోల్‌ పోషించిన సంగతి తెలిసిందే.

త్రిషతో పాటు ఐశ్వర్యరాయ్ బచ్చన్, చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ వంటి స్టార్స్ ఈ సినిమాలో కనిపించనున్నారు. పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చోళరాజుల కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus