Keerthy Suresh: సీఎం కొడుకు కోసం కీర్తి గ్రీన్ సిగ్నల్?

సౌత్ సినిమా ఇండస్ట్రీలో మంచి నటిగా తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగు తమిళ ఇండస్ట్రీలో చాలా బిజీగా కనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగులో ఆమెకు చాలా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కూడా రెండు పెద్ద సినిమాల్లో నటిస్తోంది. అయితే ఇటీవల కీర్తి సురేష్ ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న విధానంపై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి.

కథ నచ్చకపోయినా కూడా ఓకే చెప్పినట్లు కథనాలు వెలువడుతున్నాయి. సాధారణంగా కీర్తి సురేష్ ఎలాంటి సినిమా చేసినా అందులో ఏదో ఒక కొత్త తరహా కంటెంట్ అయితే ఉంటుంది. పాత్రలు కూడా చాలా విభిన్నంగా ఉంటాయి అనేలా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే కీర్తి సురేష్ ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తామన్నా కూడా కథ నచ్చకపోతే రిజెక్ట్ చేస్తుంది. స్టార్ హీరోల సినిమాలు కూడా రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.

అయితే ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి తనయుడు ఉదయనిది స్టాలిన్ ప్రాజెక్టు పెద్దగా నచ్చకపోయినా కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఆ సినిమా కథ చెప్పగానే చాలా సమయం తీసుకున్న కీర్తి సురేష్ ఫైనల్ గా ఎందుకు ఒప్పుకుంది అనే విషయంపై ప్రస్తుతం కోలీవుడ్ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇష్టం లేకపోయినా కూడా కీర్తి సురేష్ ఆ ప్రాజెక్టు చేసేందుకు ఎందుకు ఒప్పుకుంది అంటూ వెబ్ మీడియాలో కూడా సందేహాలు వెలువడుతున్నాయి.

కేవలం ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకు అనే కారణం చేతనే ఆమె ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కూడా చెబుతున్నారు. ఇక కీర్తి సురేష్ తీసుకున్న ఆలోచన విధానం ఆమెకు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. ప్రస్తుతం కీర్తి సురేష్ సర్కారు వారి పాట అనే సినిమాతో పాటు తెలుగులో బోళా శంకర్ అనే సినిమా చేస్తోంది. అలాగే మరొక రెండు ప్రాజెక్టులు కూడా వెయిటింగ్ లిస్టులో ఉన్నట్లు సమాచారం.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus