ఒకప్పటి నటి మేనక కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్ (Keerthy Suresh). కెరీర్ ప్రారంభంలో వరుసగా తమిళ, మలయాళ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె ‘నేను శైలజ’ (Nenu Sailaja) సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అటు తర్వాత ‘నేను లోకల్’ (Nenu Local) వంటి హిట్లు అందుకుంది. అయితే ‘మహానటి’ తో (Mahanati) ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది కీర్తి. అటు తర్వాతే ఈమె స్థాయి అమాంతం పెరిగిపోయింది. ఓ పక్క స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే మరోపక్క విమెన్ సెంట్రిక్ సినిమాల్లో కూడా నటిస్తుంది.
మధ్యలో ప్లాపులు పలకరించినా కీర్తి సురేష్ డిమాండ్ ఏమీ తగ్గలేదు. ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) ‘బేబీ జాన్’ (Baby John) వంటి బడా సినిమాల్లో నటిస్తూనే వచ్చింది. అయితే ఇటీవల కీర్తి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రియుడు ఆంటోనీని గత ఏడాది డిసెంబర్లో వివాహం చేసుకుని ఫ్యామిలీ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి. సాధారణంగా పెళ్ళైన హీరోయిన్లకి అవకాశాలు పెద్దగా రావు అనే సెంటిమెంట్ జనాల్లో ఉంది. అయితే కీర్తి విషయంలో అలా కాదు.
ఏకంగా క్రేజీ ఆఫర్స్ అందుకుంటుంది. నితిన్ (Nithin Kumar) హీరోగా వేణు ఎల్దిండి (Venu Yeldandi) దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’ అనే సినిమా రూపొందుతుంది. దిల్ రాజు దీనికి నిర్మాత. ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ఇందులో మెయిన్ హీరోయిన్ గా కీర్తి సురేష్ ను ఎంపిక చేసుకున్నారు. ‘దసరా’ (Dasara) తర్వాత మరోసారి ఈ సినిమాలో పక్కా తెలంగాణ అమ్మాయిగా కీర్తి కనిపించనుంది.
దీని తర్వాత సూర్య (Suriya) హీరోగా వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో కూడా కీర్తి సురేష్ హీరోయిన్ గా దాదాపు ఖరారు అయిపోయింది అని వినికిడి. సో పెళ్లయ్యాక కూడా కీర్తికి ఇలాంటి క్రేజీ ఆఫర్లు వస్తుండటం అంటే చిన్న విషయం కాదు.