మ్యూజిక్ డైరెక్టర్ ప్రేమలో కీర్తి సురేష్.. నిజమెంత!

టాలీవుడ్ లో ‘మహానటి’ సినిమాతో కీర్తి సురేష్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు దక్కించుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్ లలో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కీర్తి సురేష్ లవ్ ఎఫైర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ అనిరుధ్, కీర్తి సురేష్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మూడు నెలల క్రితం అనిరుధ్ పుట్టినరోజు నాడు అతడికి విషెస్ చెబుతూ కీర్తి కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

అందులో అనిరుధ్, కీర్తి చాలా క్లోజ్ గా కనిపించారు. అప్పటినుండి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు ఊపందుకున్నాయి. ఇక తాజాగా ఈ జంట పెళ్లికి కూడా రెడీ అయిందని వార్తలొస్తున్నాయి. కొన్ని రోజుల్లోనే వివాహబంధంతో ఒక్కటి కానున్నారని టాక్. అయితే కీర్తి సురేష్ సన్నిహితులు మాత్రం ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు. వారిద్దరి మధ్య స్నేహం తప్ప ప్రేమ లేదని చెబుతున్నారు. అయినా.. సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు సంబంధించి ఇలాంటి వార్తలు రావడం కొత్తేమీ కాదు.

పైగా అనిరుధ్ విషయంలో ఇలాంటి వార్తలు చాలా ఎక్కువగా వినిపిస్తుంటాయి. గతంలో నటి ఆండ్రియాతో అనిరుధ్ ఎఫైర్ నడిపించాడనే విషయం ఓపెన్ సీక్రెట్. ఇక రీసెంట్ గా సింగర్ జోనితా గాంధీతో అనిరుధ్ ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. శివకార్తికేయన్ నటించిన ‘డాక్టర్’ సినిమాలో సెల్లమ్మ అనే పాటతో పాపులర్ అయింది జోనితా గాంధీ. అనిరుధ్ పెళ్లి చేసుకునే వరకు అతడికి సంబంధించి ఇలాంటి రొమాంటిక్ గాసిప్స్ వస్తూనే ఉంటాయేమో!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus