ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా అందరూ ఇళ్ళలోనే ఉంటున్నారు. థియేటర్స్ కూడా ఎలాగూ ఓపెన్ లో లేవు. దీంతో అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహా, జీ5, సన్ నెక్స్ట్ వంటి డిజిటల్ ప్లాట్ ఫామ్స్ కు డిమాండ్ పెరిగింది. సబ్ స్క్రిప్షన్ లు కూడా భారీగా పెరిగాయి. కరెక్టే .. ! దీంతో చాలా వరకూ సినిమాలు డైరెక్ట్ గా ఆన్లైన్ లో విడుదల అవుతున్నాయని నెట్టింట్లో ప్రచారం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’, నాని.. సుధీర్ బాబు ల ‘వి’, రామ్ ‘రెడ్’ సినిమాలు డైరెక్ట్ గా ఆన్లైన్ లో విడుదల అవుతున్నట్టు ప్రచారం జరిగింది.
కానీ విడుదల కాలేదు. ఇప్పుడు కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘పెంగ్విన్’ కూడా డైరెక్ట్ గా ఆన్లైన్ లో విడుదలవుతుందని ప్రచారం జరుగుతుంది. ఈశ్వర్ కార్తీక్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని కార్తీక్ సుబ్బరాజు నిర్మించాడు. ‘పెంగ్విన్’ చిత్రానికి భారీ రేటు పలికి అమెజాన్ వారు బంపర్ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం శాటిలైట్ హక్కులు కొనుగోలు చేసిన వారు ముందుగా ఆన్లైన్ ప్లాట్ ఫామ్స్ లో ఇవ్వడానికి అంగీకరించడం లేదు అని చెన్నై మీడియా వర్గాల వారి సమాచారం.
వాళ్ళు ఎందుకు ఒప్పుకోవడం లేదు. అసలు కారణం ఏంటి అన్న వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ‘మహానటి’ తర్వాత కీర్తి సురేష్ క్రేజ్ పెరిగింది కాబట్టి.. ఆన్లైన్ లో కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రాన్ని చూస్తారు అని అమెజాన్ వారు భావించి ఎక్కువ రేటు చెబుతున్నట్టు తెలుస్తుంది.