Bigg Boss Telugu 6: ఇనయాని తక్కువ చేసిన ఆదిరెడ్డి..! నామినేషన్స్ లో ఉన్నది వీళ్లే..!

బిగ్ బాస్ హౌస్ లో ఆఖరి నామినేషన్స్ కి తెరలేచింది. ఇప్పుడున్న 7గురు హౌస్ మేట్స్ ని వాళ్లు ఏ ర్యాంక్ కి అర్హులో ఆ ర్యాంక్ బోర్డ్ వెనక నుంచోమని చెప్పాడు బిగ్ బాస్. దీంతో హౌస్ మేట్స్ ఒక్కొక్కరు ఒక్కో ర్యాంక్ దగ్గర నుంచుని వారి పాయింట్స్ ని చెప్పారు. ఏకాభిప్రాయంతో చివరగా మొదటి ర్యాంక్ దగ్గర రేవంత్, సెకండ్ ర్యాంక్ దగ్గర ఆదిరెడ్డి, తర్వాత శ్రీహాన్, రోహిత్, ఇనాయ, శ్రీసత్య, కీర్తి వరుసగా ఫిక్స్ అయ్యారు. అయితే, ఇక్కడే ఓటింగ్ పెట్టుకుని మరీ హౌస్ మేట్స్ ఒక అభిప్రాయానికి వచ్చారు.

ఇక బిగ్ బాస్ తనదైన స్టైల్లో శ్రీహాన్ తప్ప మిగతా వాళ్లందరూ నామినేట్ అయ్యారని చెప్పాడు. ఇక్కడే ఈ ర్యాంకింగ్స్ ఇచ్చేటపుడు హౌస్ మేట్స్ తమ మెదడుకి పదనుపెట్టారు. తమ పాయింట్స్ ని చెప్తూ తము ఎందుకు ఆ నెంబర్ కి డిస్వర్వో చెప్పుుంటా వచ్చారు. కానీ, కీర్తికి లాస్ట్ నెంబర్ వచ్చింది. ఇక్కడే కీర్తికి శ్రీహాన్ 6వ ర్యాంక్ ఇచ్చాడు. అందుకే, కీర్తి కూడా తిరిగి శ్రీహాన్ కి 6వ ర్యాంక్ అంటూ ఓటు వేసింది. నిజానికి శ్రీహాన్ టిక్కెట్ టు ఫినాలే గెలుచుకున్నాడు.

అంటే, టాప్ 5లో ఖచ్చితంగా ఉంటాడు. కానీ, కీర్తి 6వ ర్యాంక్ ఇచ్చేసరికి ఆ తర్వాత కీర్తికి మైండ్ పోయిందంటూ అంటూ ఆదిరెడ్డి కామెంట్స్ చేశాడు. శ్రీహాన్ కావాలని ఈ ర్యాంక్ ఇచ్చాడని, అందుకే కీర్తి కూడా తిరిగి ఇచ్చిందే తప్ప బుర్ర పెట్టలేదంటూ ఆదిరెడ్డి మాట్లాడాడు. అంతేకాదు, ర్యాంకింగ్స్ ఇచ్చేటపుడు మరోసారి ఇనయాని అందరూ చిన్నచూపు చూస్తే 5వ నెంబర్ ర్యాంక్ కి పరిమితం చేశారు. అయితే, ఇక్కడే ఇనాయకి ఆదిరెడ్డి 6వ ర్యాంక్ ఇచ్చాడు. ఓటింగ్ ప్రకారం మెజారిటీ ఓట్లు వచ్చిన వాళ్లు వాళ్ల ర్యాంక్ బోర్డ్ లపై నిలుచున్నారు.

ఆ తర్వాత బిగ్ బాస్ ఎవిక్షన్ ఫ్రీపాస్ కోసం కట్ చేసిన ప్రైజ్ మనీని తిరిగి గెలుచుకునేందుకు హౌస్ మేట్స్ కి మరో అవకాశం ఇచ్చాడు. ఇందులో భాగంగా బిగ్ బాస్ ఛాలెంజ్ ఇచ్చినపుడల్లా హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో ఇద్దరిని ఆ ఛాలెంజ్ లో పాల్గొనేందుకు ఎంచుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు, వారిద్దరిలో ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో సీక్రెట్ ఓటింగ్ ద్వారా చెప్పాలి. మెజారిటీ ఇంటిసభ్యులు కరెక్ట్ గా చెప్తే ప్రైజ్ మనీని కొంచెం కొంచెంగా తిరిగి పొందే అవకాశం ఉంటుంది.

మొదటి ఛాలెంజ్ లో శ్రీసత్య, ఇంకా రోహిత్ ఇద్దరూ పార్టిసిపేట్ చేశారు. అయితే, ఇక్కడే హౌస్ మేట్స్ అందరూ కూడా శ్రీసత్యని తక్కువ అంచనా వేస్తూ ఆమె ఓడిపోతుందని సీక్రెట్ ఓటింగ్ వేశారు. కానీ, శ్రీసత్య టాస్క్ లో అనూహ్యాంగా గెలిచి అందరూ ఆశ్చర్యపడేలా చేసింది. ప్రైజ్ మనీని వాళ్లు కోల్పోవాల్సి వచ్చింది. మరి మగతా ఛాలెంజ్ లో అయినా గెలిచి ఇంటిసభ్యులు ప్రైజ్ మనీని పొందుతారో లేదో చూడాలి. అదీ మేటర్.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus