Ketika Sharma: ఇంటర్వ్యూ : ‘బ్రో’ సినిమా గురించి హీరోయిన్ కేతిక శర్మ చెప్పిన ఆసక్తికర విషయాలు !

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో బ్రో అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సాయి ధరమ్ తేజ్ కి జోడీగా కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. జూలై 28 న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఇక ప్రమోషన్లలో భాగంగా కేతిక శర్మ పాల్గొని ‘బ్రో’ గురించి, ఇందులో తన పాత్ర గురించి.. ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. అవి మీ కోసం :

ప్ర. ‘బ్రో’ లో ఛాన్స్ ఎలా వచ్చింది.. ఈ కథలో మీకు నచ్చిన ఎలిమెంట్ ఏంటి?

కేతిక శర్మ : పవన్ కళ్యాణ్ గారు.! ఆయన పేరు చాలు కదా .వేరే కారణాలు అవసరం లేదు.అందుకే మొదట నన్ను అప్రోచ్ అవ్వగానే ఓకే చేసేశాను.

ప్ర.పవన్ కళ్యాణ్ గారికి మీకు కాంబినేషనల్ సీన్స్ ఉంటాయా?

కేతిక శర్మ :లేవు.! కానీ ఆయనతో సెట్స్ లో కలిసి పనిచేసే ఛాన్స్ లభించింది. గతంలో ఆయన్ని ఎప్పుడూ కలిసింది లేదు. ఆయన గురించి చాలా విన్నాను. ఈ సినిమా ద్వారా కలిసే ఛాన్స్ వచ్చింది. ఆయనతో మాట్లాడటానికి చాలా భయపడేదాన్ని.ఆయనకు తేజ్ పరిచయం చేశారు నన్ను.

ప్ర.’బ్రో’ ఒరిజినల్ ‘వినోదయ సీతమ్’ చూశారా?

కేతిక శర్మ : ఎస్ చూశాను.. కానీ ఇది కమర్షియల్ ఫార్మేట్ లో రూపొందింది. నా పాత్రకు కూడా ప్రాధాన్యత పెరిగింది. ఎంటర్టైన్మెంట్ తో పాటు ఇంకా ఎన్నో అంశాలు ఉంటాయి.. అలరిస్తాయి.

ప్ర.సాయి ధరమ్ తేజ్ తో పనిచేయడం ఎలా అనిపించింది?

కేతిక శర్మ : ఇందులో నేను సాయి ధరమ్ తేజ్ చేసిన మార్క్ కి ప్రేయసిగా చేశాను. నా గత చిత్రాల్లో కంటే ఇది డిఫరెంట్ గా ఉంటుంది.

ప్ర.మీ లాస్ట్ మూవీ వైష్ణవ్ తేజ్ తో చేశారు. ఇప్పుడు అతని అన్న సాయి ధరమ్ తేజ్ తో చేశారు. ఎలా అనిపిస్తుంది?

కేతిక శర్మ : ఇది కో ఇన్సిడెన్స్ అనుకోవాలి. ‘రంగ రంగ వైభవంగా’ లాస్ట్ షెడ్యూల్ జరుగుతున్నప్పుడు ఈ సినిమా కోసం నన్ను మేకర్స్ అప్రోచ్ అయ్యారు. చాలా ఆనందంగా అనిపించింది.

ప్ర. వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ లతో పనిచేస్తున్నప్పుడు మీరు వారిలో గమనించిన మార్పులేంటి?

కేతిక శర్మ : ఇద్దరూ స్వీట్ పర్సన్స్ . వైష్ణవ్ కి కొంచెం మొహమాటం ఎక్కువ. సాయి ధరమ్ తేజ్ అందరితో అందరితో ఇట్టే కలిసిపోతాడు.

ప్ర. ‘బ్రో’ లో మీ పాత్ర కోసం ఏమైనా హోమ్ వర్క్ చేశారా?

కేతిక శర్మ : ఒరిజినల్ తో పోలిస్తే.. ఇందులో నా పాత్ర నిడివి ఎక్కువ అలాగే ప్రాముఖ్యత ఎక్కువ. దానికి తగ్గ వర్క్ చేశాను. అందరికీ నా పాత్ర నచ్చుతుంది అనుకుంటున్నాను.

ప్ర.దర్శకుడు సముద్రఖనితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?

కేతిక శర్మ :సముద్రఖని చాలా ఫాస్ట్ గా ఉంటారు. ఎక్కువ టేక్స్ చేయాలని అనుకోరు. నటీనటుల నుండి బెస్ట్ ఎలా తీసుకోవాలో ఆయనకు బాగా తెలుసు. ఆయన నటుడు కూడా కావడం వల్ల.. ఇంకా ఎక్కువ టిప్స్ ఇచ్చి.. తనకు కావలసినట్టు పెర్ఫార్మ్ చేయించుకుంటారు.

ప్ర.ఈ సినిమాకి త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించారు.. ఆయన శైలి డైలాగ్స్ పలకడం ఎలా అనిపించింది?

కేతిక శర్మ :త్రివిక్రమ్ గారి అద్భుతమైన రచన ఈ సినిమాకు హైలెట్ అవుతుంది. నాతో కూడా మంచి డైలాగ్స్ చెప్పించారు. రేపు మీరు స్క్రీన్ పై చూసినప్పుడు నేనేనా అని అనుకుంటారు. ఆ క్రెడిట్ త్రివిక్రమ్ గారికే చెల్లుతుంది.

ప్ర. మీ గత సినిమాలు పెద్దగా ఆడలేదు.. అయినా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. మీ కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు..!

కేతిక శర్మ : నిజమే.. నా గత సినిమాలు అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. కానీ సక్సెస్ అనేది నా చేతుల్లో ఉండదు. కానీ నేను అదృష్టవంతురాలిని. ‘బ్రో’ లాంటి గొప్ప సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి.

ప్ర. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లో పనిచేయడం ఎలా అనిపించింది?

కేతిక శర్మ : నటీనటులని చాలా కేరింగ్ గా చూసుకుంటారు.చాలా కంఫర్టబుల్ గా పని చేసుకోవచ్చు.

ప్ర. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి?

కేతిక శర్మ : ‘ఆహా స్టూడియోస్’ తో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాను. త్వరలోనే ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు.

ప్ర.మీ డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా?

కేతిక శర్మ : నేను (Ketika Sharma) స్విమ్మింగ్ లో ఛాంపియన్ ని.! సో నాకు ఎవరైనా గ్రేట్ స్విమ్మర్ ఉంటే వాళ్ళ బయోపిక్ లో నటించాలి అనుకుంటున్నాను.

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus